Cops, Guards Injured While Rescuing Leopard పోలీసులi, అటవీ సిబ్బందిపై తిర‌గ‌బ‌డ్డ చిరుత‌..

Leopard attacks officers during rescue operation in haryana s panipat

leopard attacks police officers, leopard attack forest officials, leopard in Haryana Panipat, leopard in Panipat, leopard attack in Haryana, leopard, Panipat, leopard, sho, Behrampur village, Panipat leopard news, Panipat district, Sanouli SHO, Jagjit Singh, veterinary surgeon Ashok Khasa, Virender Gahlyan, SHO Jagjit Singh, Crime

A cop and two forest department officials were injured during an operation to catch a leopard in the Behrampur village of Haryana's Panipat. The leopard was later successfully tranquilised. The incident occurred when a rescue team was conducting an operation to catch the leopard. The team was acting on a message from villagers who had spotted the leopard.

ITEMVIDEOS: పోలీసులు, అటవీ సిబ్బందిపై తిర‌గ‌బ‌డ్డ చిరుత‌..

Posted: 05/09/2022 01:34 PM IST
Leopard attacks officers during rescue operation in haryana s panipat

భీకర అడవుల్లో సంచరించాల్సిన వన్యమృగాలు జనారణ్యంలో సంచరిస్తున్నాయి. దీంతో ఈ మధ్యకాలంలో అటవీశాఖ సిబ్బందికి పని ఎక్కువైంది. అభివృద్ది పేరుతో అరణ్యాలను మనుషులు హరిస్తున్న తరుణంలో అడవుల్లో సంచరించాల్సిన ప్రాణులు.. జనాలమధ్యకు చోచ్చుకోస్తున్నాయి. అయితే వాటని పట్టుకోవడంలో తర్ఫీదు పోందిన అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు వన్యమృగాలను పట్టుకుని జూలకు తరలిస్తున్నారు. ఇక ఏనుగులు, ఎలుగుబంట్ల లాంటి వన్యమృదాలు తిరిగి అడవుల్లోకి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, తాజాగా ఇలానే దారితప్పి వచ్చిన ఓ చిరుత అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులను ముప్పుతప్పలు పెట్టింది. తననే పట్టుకుంటారా.? అన్నట్లుగా వారిపై తిరగబడి దాడి చేసింది. అయితే అటవీశాఖ సిబ్బంది, పోలీసులు గాయాలపాలైనా.. చివరకు దానిని పట్టుకుని స్థానిక జూ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన హ‌ర్యానాలోని పానిప‌ట్ స‌మీపంలోని బెహ‌రంపూర్ గ్రామంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు పోలీసులు, ఇద్ద‌రు ఫారెస్ట్ అధికారులు గాయ‌ప‌డ్డారు. ప‌ట్టుకునేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై ఆ చిరుత అటాక్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కోడుతోంది.

స్థానిక గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించిన వారితో పాటు చిరత ఉన్న గ్రామానికి చేరుకున్నారు. దానిని మత్తుమందు ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేస్తుండగానే అది ఆకస్మాత్తుగా ఎదురుదాడికి దిగింది. దీంతో దానిని క‌ర్ర‌ల‌తో కొట్టాల‌నుకున్నా.. అది సాధ్యం కాకపోగా పోలీసు, అటవీ సిబ్బందిని చిరుత హ‌డ‌లెత్తించింది. అయిదారుగు పోలీసులు చుట్టుముట్టినా ఆ చిరుత మాత్రం అంద‌రిపై దూకుతూ వ‌ణికించింది. చివ‌ర‌కు దానికి మ‌త్తు ఇచ్చి విజ‌య‌వంతంగా బంధించారు. గ్రామ‌స్థులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు శ‌నివారం పోలీసులు ఆ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఎస్‌హెచ్‌వో తో పాటు ఇద్ద‌రు ఫారెస్ట్ ఆఫీస‌ర్లు గాయ‌ప‌డ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles