SC grants time to Centre to file reply on sedition law `దేశ‌ద్రోహం చ‌ట్టం ఉండాల్సిందే.. దుర్వినియోగం కాకుండా చూస్తే చాలు`

Sedition law challenge sc explores larger bench ag for norms against law misuse

Sedition law challenged, sedition law in Supreme court, Sedition Law Validity, Attorney General K K Venugopal, five-judge Constitution bench, Solicitor General Tushar Mehta, sedition law case, supreme court sedition law case, sc sedition law, sedition law case date, sedition law case hearing, National, Crime

Contending that the ruling by a five-judge Constitution bench in Kedar Nath Singh vs State of Bihar was a “very well balanced judgment” and need not be referred to a larger bench, Attorney General K K Venugopal said Section 124A should be retained and only guidelines be laid down to prevent its misuse. Venugopal is assisting the court in the matter in his capacity as Attorney General while the Central government is being represented by Solicitor General Tushar Mehta.

`దేశ‌ద్రోహం చ‌ట్టం ఉండాల్సిందే.. దుర్వినియోగం కాకుండా చూస్తే చాలు`

Posted: 05/06/2022 09:00 PM IST
Sedition law challenge sc explores larger bench ag for norms against law misuse

దేశ ద్రోహానికి సంబంధించిన ఐపీసీలోని 124ఏ సెక్ష‌న్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి కొంత సమయాన్ని కేటాయించింది. ఈ విషయంలో తుది నివేదిక సమర్పించే అంశమై ఈ నెల 9లోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. 1962లో కేదార్‌నాథ్ కేసులో ఇచ్చిన తీర్పు స‌మ‌గ్రంగా ఉంద‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ అత్యున్న‌త న్యాయ‌స్థానానికి తెలిపారు. అప్పుడు ఆ కేసును ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాసనం విచారించింద‌ని గుర్తు చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ మ‌రో ధ‌ర్మాస‌నం దీన్ని విచారించాల్సిన అవ‌స‌రం లేద‌ని భావిస్తున్నామన్నారు. ఈ చ‌ట్టం దుర్వినియోగం కాకుండా, నిబంధ‌న‌ల‌ను రూపొందించ‌వ‌చ్చ‌న్నారు.

ఈ సంద‌ర్బంగా మ‌హారాష్ట్ర‌లో ఒక ఎంపీపై ఈ సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేసిన విష‌యాన్ని ఏజీ కేకే వేణుగోపాల్ ప్ర‌స్తావించారు. ఒక ఎంపీ, త‌న భ‌ర్త అయిన ఎమ్మెల్యేతో పాటు హ‌నుమాన్ చాలీసాను ప‌ఠించినందుకు వారిపై ఈ కేస్ పెట్టార‌న్నారు. ఇలాంటి దుర్వినియోగాల‌ను అరిక‌ట్టాల్సి ఉంద‌న్నారు. `దేశంలో ఏం జ‌రుగుతుందో చూస్తున్నారు క‌దా! హ‌నుమాన్ చాలీసా ప‌ఠించినందుకు దేశ‌ద్రోహం కేసు పెట్టారు. ఇలాంటి దుర్వినియోగాల‌ను అరిక‌ట్ట‌డానికి నిబంధ‌న‌ల‌ను రూపొందించాల్సి ఉంది. అంతేకానీ, ఈ అంశాన్ని మ‌రో పెద్ద ధ‌ర్మాస‌నం ముందుకు పున‌ర్విచార‌ణ‌కు తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం లేదు` అని ఏజీ వేణుగోపాల్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నానికి వివ‌రించారు.

బ్రిటిష్ కాలం నాటి దేశ‌ద్రోహం చ‌ట్టానికి కాలం చెల్లింద‌ని, దానిని ప్ర‌భుత్వాలు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నాయ‌ని, దానిని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై గురువారం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ అంశంపై ఇప్ప‌టికే ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం తీర్పు వెలువ‌రించినందున‌, ఇప్పుడు ఏడుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఈ పిటిష‌న్ల‌ను విచారిస్తుందా? లేక ప్ర‌స్తుతం ఈ కేసును విచారిస్తున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌న‌మే విచార‌ణ కొన‌సాగిస్తుందా? అన్న విష‌యాన్ని సుప్రీంకోర్టు త్వ‌ర‌లో తేల్చ‌నుంది. 1962లో సుప్రీంకోర్టు కేదార్‌నాథ్ సింగ్ కేసులో ఈ చ‌ట్టం చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌, అవ‌స‌రంపై తీర్పు ప్ర‌క‌టించింది. హింస‌కు పాల్ప‌డేలా రెచ్చ‌గొట్ట‌డం, హింస‌కు పాల్ప‌డ‌డం వంటి నేరాల‌ను మిన‌హాయంచి, కేవ‌లం ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించినంత మాత్రాన ఈ దేశ‌ద్రోహం చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయ‌డాన్ని నాటి తీర్పు త‌ప్పుబ‌ట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles