Man swallows jewellery worth Rs 1.45 lakh with biryani విందు బోజనానికి వచ్చి.. బంగారు నగలను, వజ్రాన్ని మింగేశాడు.!

Jewellery worth rs 1 45 lakh recovered from man s stomach after he swallowed it with biryani on eid

Chennai Man Gulps Jewellery, Chennai Man swallows Jewellery, Chennai Man swallows Jewellery with biryani, Chennai police, eid celebration, chennai viral news, Tamil nadu, Man swallows jewellery, man swallows jewellery, chennai news, chennai crime, Virugambakkam police, tamil nadu, crime, trending news, latest viral news

Chennai police have recovered jewellery worth Rs 1.45 lakh from the stomach of a 32-year-old man who swallowed it with biryani during the Eid celebrations at a friend's residence on May 3. Police said that doctors gave him enema to recover the jewellery from his stomach. The man along with his girlfriend was invited by a friend for Eid celebrations at her home.

విందు బోజనానికి వచ్చి.. బంగారు నగలను, వజ్రాన్ని మింగేశాడు.!

Posted: 05/06/2022 04:41 PM IST
Jewellery worth rs 1 45 lakh recovered from man s stomach after he swallowed it with biryani on eid

రంజాన్ పండుగ సందర్భంగా మిత్రులను పార్టీకి ఆహ్వానించి విందు ఇవ్వగా ఓ మిత్రురాలి బాయ్ ఫ్రెండ్ చేసిన నిర్వాకం ఆయనను ఆసుపత్రిపాలు చేసింది. అదెలా అంటే.. ర్ల్​ఫ్రెండ్​ స్నేహితురాలు ఇచ్చిన పార్టీకి వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడ ఉన్న రూ. 1.45లక్షల విలువ చేసే నగలను మింగేశాడు. పార్టీకి వెళ్లి ఫుల్​ తాగి, బిర్యానితో పాటు రూ. 1.45లక్షల విలువ చేసే నగలను కూడా పొట్టలోకి తోసేశాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3న రంజాన్ పండగ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. నగల దుకాణాన్ని నడుపుతున్న ఓ మహిళ.. ఈద్​ సందర్భంగా ఘనంగా పార్టీని నిర్వహించింది. పార్టీకి తన స్నేహితురాలిని పిలిచింది. ఆమె.. తన బాయ్​ఫ్రెండ్​తో పార్టీకి వెళ్లింది.

పార్టీలో ఫుల్​గా తాగేసిన ఆ బాయ్​ఫ్రెండ్​.. ఏం చేస్తున్నాడో అర్థం కాని స్థితికి చేరాడు. ఈ క్రమంలోనే బిర్యానితో పాటు తెలియకుండానే రూ. లక్షల విలువైన నగలను కూడా బిర్యాని అనుకుని మింగేశాడు. తిథులందరు వెళ్లిపోయిన తర్వాత, పార్టీ ఇచ్చిన మహిళ.. ఇల్లు సద్దడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కాప్​బోర్డులో ఉండాల్సిన గోల్డ్​ చెయిన్​, డైమండ్​ పెండెంట్​, డైమెంట్​ నెక్లెస్​లు అదృశ్యమైనట్టు గ్రహించింది. అతిథులను సంప్రదించిన తర్వాత.. తన స్నేహితురాలి బాయ్​ఫ్రెండ్​ మీద ఆమెకు అనుమానం పెరిగింది. తన నగలను అతడు దొంగలించి ఉంటాడని భావించి, విరుగంబక్కం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ నెల 4న ఆ వ్యక్తిని పిలిపించి విచారణ జరిపారు. అయితే అప్పటికే కడుపులో నొప్పితో సదరు వ్యక్తి బాధపడుతున్నాడు. పోలీసులు అడిగేసరికి విషయం అతనికి అర్థమైంది. దీంతో చేసిన నేరాన్ని అతను ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి కడుపును స్కాన్​ చేసిన పోలీసులకు.. లోపల నగలు కనిపించాయి. వెంటనే అతడిని వైద్యుల వద్దకు తీసుకెళ్లారు పోలీసులు. రూ. 95వేలు విలువచేసే నెక్లెస్​, రూ. 25వేల గోల్డ్​ను పొట్టలో నుంచి బయటకు తీశారు. కానీ పెండెంట్​ మాత్రం కడుపులోనే ఉండిపోయింది. మరో ఆపరేషన్​ చేసిన దానిని కూడా బయటకు తీశారు వైద్యులు. తాగిన మైకంలోనే అతను నగలను మింగేసినట్టు పోలీసులు నిర్ధరణకు వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : man swallows jewellery  chennai news  chennai crime  Virugambakkam police  tamil nadu  crime  

Other Articles