BSF detects cross-border tunnel near IB in Samba sector అంతర్జాతీయ సరిహద్దుల్లో సొరంగం.. అక్రమ చొరబాట్లు దీనిగుండానేనా!

Cross border tunnel used by jem suicide bombers detected in j k s samba

Amarnath Ji Yatra, BSF, Samba district, tunnel, Jaish e Mohammed, Pakistan, Terror Group, BSF,Border Security Force, Pakistan tunnel, Pakistan, Jaish, Sunjwan encounter, Samba district, Jammu and Kashmir, CrimeBSF,Border Security Force, Pakistan tunnel, Pakistan, Jaish, Sunjwan encounter, Samba district, Jammu and Kashmir, Crime

The Border Security Force detected a freshly dug Pakistani 'tunnel' in the Samba sector of Jammu. The tunnel has been found just 150 meters away from the International border with Pakistan. The Border Security Force detected the suspected tunnel during its special tunnel checking exercise. BSF had launched an anti-tunnel exercise earlier this week after Jaish terror attack in Sunjwan, Jammu.

అంతర్జాతీయ సరిహద్దుల్లో సొరంగం.. అక్రమ చొరబాట్లు దీనిగుండానేనా!

Posted: 05/05/2022 12:27 PM IST
Cross border tunnel used by jem suicide bombers detected in j k s samba

జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల తాజాగా మరో సొరంగం బయటపడింది. ఇది పాక్‌కు అత్యంత సమీపంలోనే ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సాంబా సెక్టార్‌లోని చక్‌ఫకీరా చెక్‌పోస్ట్‌ సరిహద్దు సమీపంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గుర్తించారు. దీంతో అది ఎక్కడి నుంచి ఉందనే విషయాన్ని గుర్తించడానికి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అంతర్రాష్ట్రీయ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఈ సొరంగం ఉందని తేలింది. తాజాగా జరిగిన అక్రమ చొరబాట్లు దీనిగుండానే జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు.

భారత భూభాగంలో ఉన్న సొరంగ ముఖద్వారం అంతర్జాతీయ సరిహద్దులో 150 మీటర్ల నుంచి 200 మీటర్ల దూరంలో ఉందని భావిస్తున్నారు. కాగా, అమర్‌నాథ్‌ యాత్రను అడ్డుకోవడానికే పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ఏర్పాటు చేసుకున్నారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా సాంబా సెక్టార్ లో బయటపడిన పోరంగంతో.. గడిచిన పదేళ్ల కాలంలో ఇది పదకొండవ సరంగం కాగా ఏడాదిన్నర కాలంలో ఇది ఐదవ సోరంగమని సరిహద్దు భద్రతా ధళాలు స్పష్టం చేస్తున్నాయి. జమ్మూలోని సాంబా సెక్టార్‌ పాకిస్థాన్ కు అత్యంత సమీపంలో వున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే ఉగ్రవాదులు సొరంగాలను తవ్వి అక్రమచోరబాట్లకు పాల్పడుతున్నారు.

దేశంలోకి అక్రమంగా చోరబడేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మాద్ కు చెందిన ఉగ్రవాదులు ఈ సొరంగా మార్గాన్ని ఎంచుకున్నారని గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల టన్నెల్‌ను గుర్తించడం సరిహద్దు భద్రతా దళాలకు పెద్ద విజయమని, దేశభద్రత నేపథ్యంలో వారు నిత్యం ఎంతో అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనమని.. ఇలానే ముందుకు సాగుతున్నామని ఇన్‌స్పెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) జమ్మూ డికె బూరా విలేకరుల సమావేశంలో అన్నారు. సొరంగ మార్గాల అంశంపై పాకిస్థాన్‌కు తీవ్ర నిరసన తెలియజేస్తామని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2012 నుంచి జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద 11 సొరంగాలను బీఎస్‌ఎఫ్ గుర్తించిందని చెప్పారు. ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూలో పర్యటించనున్న నేపథ్యంలో సుంజ్వాన్‌లో దాడి చేసేందుకు ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించారనేది ఊహాగానాలేనని ఆయన అన్నారు. ఈ సొరంగాన్ని సుంజ్వాన్ దాడికి అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే అది కేవలం ఊహాగానాలేనని, ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు. సాంబాలోని సొరంగంపై ఇసుక గట్లపై ఎలాంటి గుర్తులు లేవని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles