Allow Rahul Gandhi to interact with OU students: Telangana HC ఓయూలో రాహుల్ గాంధీ మీట్ కు హైకోర్టు అనుమతి.!

Telangana high court directs osmania university vc to permit rahul gandhi s meeting

Osmania University, Rahul Gandhi, NSUI, NSUI president Venkat Balmoor, Vice-Chancellor, Hyderabad, Telangana High Court, Telangana, Politics

Following the tussle between Osmania university’s administration and student activists over Rahul Gandhi’s visit, the Telangana high court directed the Vice-Chancellor of OU to reconsider the appeal filed by the students and allow for the Congress leader’s visit. It further asked the VC to issue any instructions he deemed necessary.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ మీట్ కు హైకోర్టు అనుమతి.!

Posted: 05/04/2022 07:26 PM IST
Telangana high court directs osmania university vc to permit rahul gandhi s meeting

తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ సభ్యుడ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈనెల 7న రాహుల్ గాంధీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అయితే ఈ పర్యటనకు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అనుమతిని నిరాకరించారు. అయితే ఇటీవల ఈ అంశమై చర్చించిన ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా విభాగం.. విశ్వవిద్యాలయంలో రాజకీయాలకు వేదిక కారదని అనుమతిని నిరాకరిచింది. తాజాగా హైకోర్ట్ ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని వీసీకి ఆదేశాలు జారీ చేసింది.

ఈరోజు కాంగ్రెస్ నేతలు హైకోర్ట్ లో మరోసారి హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్ట్ ఆదేశాలను వీసీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ కోర్టు కు వెల్లడించింది. తాజాగా ఈరోజు వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. రాహుల్ గాంధీ ఓయూలో విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే వస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ తరుపున న్యాయవాదులు బలంగా వాదించారు. తాజాగా రాహుల్ గాంధీ పర్యటనకు హైకోర్ట్ అనుమతి ఇవ్వాలని ఓయూ వీసీని ఆదేశించింది. అయితే ఈ పర్యటనకు కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది. 150 మందితో మాత్రమే అనుమతించాలని వీసీని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles