Rahul Gandhi was in Nepal to attend friend’s wedding నైట్‌క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ.. బీజేపి ట్వీట్ పై నెటిజనుల ఫైర్.!

Not a crime to attend wedding congress vs bjp over rahul gandhi video

Rahul Gandhi, Nepal, BJP, Pathankot, PM Modi surprise visit to Pakistan, Pak PM Nawaz Sharif', Nawaz Sharif's daughter's wedding, Uninvited guest, Congress spokesperson, Randeep Surjewala, Daily use commondites, Petrol, diesel, LPG Gas, GST, National politics

Congress leader Rahul Gandhi's visit to Nepal for a friend's wedding triggered a barrage of tweets from the BJP and its supporters, many of them taking shots at the politician for attending a party while being critical of the government on social media. The Congress, however, hit back, saying it was not yet a crime to visit a friendly nation to attend a friend's wedding, and it was much less egregious than Prime Minister Narendra Modi making a surprise visit to former Pakistan Prime Minister Nawaz Sharif's daughter's wedding in 2015.

నేపాల్ నైట్‌క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ.. బీజేపి ట్వీట్ పై నెటిజనుల ఫైర్.!

Posted: 05/03/2022 04:45 PM IST
Not a crime to attend wedding congress vs bjp over rahul gandhi video

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ సభ్యుడు రాహుల్ గాంధీ.. నైట్‌క్ల‌బ్ విజిట్ చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో వైర‌ల్ అవుతోంది. బీజేపీ ఐటీ ఇంచార్జీ అమిత్ మాల్వియా ఆ వీడియోను ట్వీట్ చేశారు. డిమ్ లైట్ ఉన్న నైట్‌క్ల‌బ్‌లో ఓ మ‌హిళా ఫ్రెండ్‌తో రాహుల్ ఉన్న‌ట్లు ఆ వీడియోలో ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ మ్యూజిక్‌కు జ‌నం డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. నేపాల్ రాజ‌ధానిలోని ప్ర‌ఖ్యాత నైట్‌క్ల‌బ్‌కు రాహుల్ వెళ్లిన‌ట్లు తె లుస్తోంది. జ‌ర్న‌లిస్టు ఫ్రెండ్ సుమ్నిమా ఉడాస్ పెళ్లికి హాజ‌ర‌య్యేందుకు సోమ‌వారం రాహుల్ ఖాఠ్మాండు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ఒక‌వైపు లుక‌లుక‌లుంటే.. మ‌రో వైపు రాహుల్ విదేశీ నైట్ క్ల‌బ్‌ల‌కు వెళ్లార‌ని అమిత్ మాల్వియా ఆరోపించారు.

"ముంబైలో అలజడులు ఉన్న వేళ రాహుల్​ గాంధీ నైట్​ క్లబ్​లో ఉన్నారు. కాంగ్రెస్​ నాశనం అవుతుంటే.. ఆయన మాత్రం నైట్​ క్లబ్​లకు వెళుతున్నారు. ఇలాంటివి ఆయనకు అలవాటే," అని బీజేపీ ఐటీసెల్​ ఇన్​ఛార్జ్​ అమిత్​ మాల్వియా ట్వీట్​చేశారు. "ముంబైలో అలజడులు ఉన్న వేళ రాహుల్​ గాంధీ నైట్​ క్లబ్​లో ఉన్నారు. కాంగ్రెస్​ నాశనం అవుతుంటే.. ఆయన మాత్రం నైట్​ క్లబ్​లకు వెళుతున్నారు. ఇలాంటివి ఆయనకు అలవాటే," అని బీజేపీ ఐటీ సెల్​ ఇన్​ఛార్జ్​ అమిత్​ మాల్వియా ట్వీట్​ చేశారు. ఎన్డీఏ పక్షాలు బీజేపికి వంతపాడుతూ రాహుల్ ను టార్గెట్ చేయగా, కాంగ్రెస్ కూడా ధీటుగానే స్పందించింది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్పందిస్తూ.. నేపాల్‌ జర్నలిస్ట్ సుమ్నిమా ఉదాస్ పెళ్లి రాహుల్ గాంధీ వెళ్లారని స్పష్టం చేశారు. ఫ్యామిలీ కార్యక్రమాల్లో పాల్గొనడం నేరం కాదని అన్నారు. అమె తండ్రి ఆహ్వానం మేరకే రాహుల్ అక్కడికి వెళ్లారే తప్ప.. పిలవని పేరంటానికి ప్రధాని మోడీ శత్రదేశమైన పాకిస్థాన్ వెళ్లినట్టుగా వెళ్లలేదని అన్నారు. 2015లో నవాజ్ షరీఫ్ కూతురు పెళ్లికి అక్కడి నుంచి ఆహ్వానం లేకపోయినా వెళ్లి.. ప్రధాని నరేంద్ర మోడీ కేక్ కట్ చేయించింది నిజం కాదా.? అని ప్రశ్నించారు. ప్రధాని హోదాలో ప్రోటోకాల్ లో లేని సర్ ప్రైజ్ విజిట్ లు మీరు చేయవచ్చా అని రివర్స్ అటాక్ చేశారు.  మోడీ పాకిస్తాన్ వెళ్లొచ్చాకే పఠాన్ కోట్‌పై ఉగ్రదాడి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు నెట్టింట్లో రాహుల్ నైట్ క్లబ్ వీడియోపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. బీజేపి సానుభూతిపరులు రాహుల్ ను టార్గె్ట్ చేస్తుండగా, మిగిలిని నెట్ జనులు మాత్రం బీజేపినే టార్గెట్ చేస్తున్నారు. దేశంలో పెరిగిన ఇంధన ధరలు, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకులు ధరలపై ఫోకస్ పెట్టాలని.. అంతేకానీ.. ఎవరు ఏ దేశం వెళ్తున్నారు.. అక్కడ ఏ క్లబ్ లోకి వెళ్తున్నారన్న అంశాలపై కాదని కామెంట్లు పెడుతున్నారు. బీజేపి ఇప్పటికీ దృష్టిమరల్చే రాజకీయాలే చేస్తోందని.. వారి పాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజలు, వేతన జీవుల కష్టాలపై కూడా ఇలానే ఫోకస్ పెడితే మంచిదని నెటిజనులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

రాహుల్ గాంధీ నేపాల్ ఎందుకు వెళ్లారు.?

భారత మిత్రదేశమైన నేపాల్ నుంచి అందిన వివాహ ఆహ్వానం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం సాయంత్రం ఖాట్మాండు వెళ్లారు. గతంలో మయన్మార్ కు నేపాల్ రాయభారిగా పనిచేసిన భీమ్ ఉదాస్ తన కూతురు వివాహం నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపారు. అంతేకాదు తప్పకుండా రావాలని కూడా ఆయన ఫోన్ చేయడంతో కాదనలేకపోయిన రాహుల్.. ఆయన ఆహ్వానం మేరకు వివాహ వేడుక కోసం నేపాల్ వెళ్లారు. ఆదివారం సాయంత్రం విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయ‌న 4.40 నిమిషాల‌కు అక్క‌డికి చేరుకున్న‌ట్లు తెలుస్తోంది.

నేపాలీ ఫ్రెండ్ సుమ్నిమా దాస్ పెళ్లికి రాహుల్ గాంధీతో పాటు ఆయ‌న మిత్రులు.. మరికోందరు కూడా నేపాల్ చేరుకున్నారు. వీరంతా ఖాట్మాండులోని మారియ‌ట్ హోట‌ల్‌లో బ‌స చేస్తున్నారు. వెళ్లారు. సుమ్నిమా తండ్రి బీమ్ ఉదాస్ పంపిన ఆహ్వానం మేర‌కు రాహుల్ పెళ్లికి వెళ్లారు. జ‌ర్న‌లిస్టు సుమ్నిమా గ‌తంలో సీఎన్ఎన్ క‌రస్పాండెంట్‌గా చేశారు. నిమా మార్టిన్ షెర్పాను ఆమె పెళ్లి చేసుకుంటోంది. మంగ‌ళ‌వారం పెళ్లి తంతు నిర్వ‌హిస్తున్నారు. మే 5వ తేదీన రిసెప్ష‌న్ ఉంది. బౌద్ధ‌లో ఉన్న హ‌య్య‌త్ రీజెన్సీ హోట‌ల్‌లో రిసెప్ష‌న్‌ను ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి కోసం ఇండియా నుంచి మ‌రికొంత మంది వీవీఐపీలు హాజ‌ర‌య్యారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles