Rajasthan Man Allegedly Gets Wife Gangraped by Relatives కట్నం కోసం భర్త దారుణం.. భార్యపై బంధువులతో గ్యాంగ్ రేప్.!

Rajasthan man allegedly gets wife gangraped by relatives uploads video to youtube for dowry

wife gang raped by his relatives, Rajasthan Man Gets Wife Gangraped, Rajasthan rape incident, Bharatpur rape, Husband, Dowry, wife, Relatives, wife gangrape, crime against women, dowry, gangrape, YouTube, Bharatpur rape, Rajasthan, crime

A man in Rajasthan’s Bharatpur allegedly got his wife gang raped by his relatives after her family failed to pay him a dowry of Rs 1.5 lakh. He allegedly filmed the video of the gang rape and uploaded it on a media platform. The husband allegedly told his wife that he would get the dowry money by uploading her sexual abuse video from YouTube.

కట్నం కోసం భర్త దారుణం.. భార్యపై బంధువులతో గ్యాంగ్ రేప్.!

Posted: 04/30/2022 02:29 PM IST
Rajasthan man allegedly gets wife gangraped by relatives uploads video to youtube for dowry

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనలు ఈ మధ్యాకలంలో ప్రతీ రోజు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు భద్రత కేవలం తల్లి మాత్రమేనని ఇప్పటికే పలు ఘటనలు నిరూపించాయి. తండ్రి, భర్త, సోదరులు నుంచి కూడా వారికి తగు భద్రత లభిస్తున్నా.. పలు ఘటనలు మాత్రం అక్కడా వారికి భద్రత కరువైందని తేటతెల్లం చేస్తున్నాయి. ఇక తాజాగా రాజస్థాన్​లోని భరత్​పూర్​లో వెలుగుచూసిన ఘటనలో జీవిత భాగస్వామి అయిన భర్తే.. కట్నం కోసం ఎవరూ చేయని దారుణానికి ఒడిగట్టాడు. వరకట్న వేధింపులతో ఇంటినుంచి వెళ్లిపోయిన భార్యతను మారిన మనిషిలా తీసుకువచ్చి.. అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

తన బంధువుల చేత అమెపై అఘాయిత్యానికి పాల్పడేలా ప్రేరేపించడంతో పాటు ఆ దృశ్యాలను తన ఫోన్లో బంధించి షోషల్ మీడియాలో పెట్టి మరీ వికృతానందం పోందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే.. బాధితురాలికి 2019లో వివాహం జరిగింది. నూతన వధువుగా అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమెకు నెల రోజులు బాగానే వున్నా.. ఆ వెంటనే ఆమె అత్తామామలు, భర్త.. అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉన్నారు. వారి వేధింపులు తీవ్రం కావడంతో తట్టుకోలేకపోయిన ఆ నూతన వధువు.. ఇక తాను అత్తారింట్లో ఉండలేనని భావించింది. కట్నమే ముఖ్యమని భావించిన భర్తతో తాను కాపురం చేయలేనని పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే ఇలా తన మానన తాను బతుకుతున్న భార్యపై తీవ్రమైన అక్కస్సు పెంచుకున్న అమె భర్త.. అమెకు కొన్ని రోజుల క్రితం ఫోన్​ చేశాడు. అమె లేకుండా తాను ఉండేలనని నమ్మబలికాడు. ఇంటికి తిరిగి రావాలని వేడుకున్నాడు. భర్త మారిపోయాడు అని భావించి.. ఆమె అత్తారింటికి వెళ్లింది. కానీ అదే ఆమె జీవితాన్ని మార్చేసింది! భార్య ఇంట్లో ఉన్న సమయంలో.. ఆ భర్త కొందరు బంధువులను పిలిపించాడు. ఆ తర్వాత.. వారి చేత ఆమెను రేప్​ చేయించాడని మహిళ ఆరోపించింది. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను ఫోన్​లో చిత్రీకరించి, యూట్యూబ్​లో అప్లోడ్​ చేశాడని చెప్పింది.

'మీ కుటుంబం.. నాకు కట్నం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ విడియోను నేను యూట్యూబ్​లో అప్లోడ్​ చేసి డబ్బులు సంపాదించుకుంటాను,' ఆ భర్త.. మహిళపై అరిచాడు. కొన్ని రోజులు తర్వాత.. నిందితుల్లో ఒకరు తనను వేరే ప్రాంతానికి తీసుకెళ్లినట్టు, అక్కడ తనపై మరోమారు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు వెల్లడించింది. అక్కడి నుంచి తాను తప్పించుకుని పుట్టింటికి వెళ్లినట్టు పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. యూట్యూబ్​లో వీడియో అప్లోడ్​ చేశారా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదని కమాన్​ పోలీస్​స్టేషన్​ అధికారి దౌలత్​ సాహు మీడియాకు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Husband  Dowry  wife  Relatives  wife gangrape  crime against women  dowry  gangrape  YouTube  Bharatpur rape  Rajasthan  crime  

Other Articles