Myanmar junta court jails Suu Kyi for 5 years for corruption ఉద్యమకారిణి అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు.!

Ousted myanmar leader aung san suu kyi sentenced to 5 years in prison in first corruption case

aung san suu kyi, myanmar junta, aung san suu kyi corruption cases, Military, Junta, Coup, Criminal, Corruption, myanmar, Politics, world, Crime

Aung San Suu Kyi, the ousted civilian leader of Myanmar and Nobel laureate, was found guilty of corruption and sentenced to five years in jail, news agency AFP reported, citing sources. A Myanmar junta court accused the 76-year-old leader of accepting a bribe of $600,000 cash and gold bars. The case was the first of 11 corruption charges against Suu Kyi, each carrying a maximum sentence of 15 years in prison.

మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు.!

Posted: 04/27/2022 05:25 PM IST
Ousted myanmar leader aung san suu kyi sentenced to 5 years in prison in first corruption case

మయన్మార్ హక్కుల కార్యకర్త, ప్రజాస్వామ పరిపాలన కోసం ఉద్యమించిన నారీమణి, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీకి  మయన్మార్ లోని న్యాయస్థానం మరోమారు జైలు ఊచల వెనక్కు పంపింది. అయితే ఈ సారి అమె ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించిన నేపథ్యంలో కాదు.. కానీ అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో విచారణించిన న్యాయస్థానం ఒక కేసులో అమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అవినీతి కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెపై అభియోగాలను విచారించిన మయన్మార్ లోని జుంటా న్యాయస్థానం అంగ్ సాన్ సూకీని దోషిగా తేల్చింది.

అంగ్ సాన్ సూకీ 6 లక్షల డాలర్లను నగదు, బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు జుంటా కోర్టు స్పష్టం చేసింది. అంగ్ సాన్ సూకీపై అక్కడి సైనిక ప్రభుత్వం మొత్తం 11 అవినీతి కేసులను మోపింది. వీటిలో అభియోగాలు నిరూపితం అయితే ఒక్కో దానిలో గరిష్ఠంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. ఈ 11 కేసుల్లో విచారణ పూర్తయిన మొదటి అవినీతి కేసు ఇది. నాలుగు గోడల మధ్యే కేసు విచారణ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇంతకుమించి వివరాలు బయటకు రాకుండా అక్కడి సైనిక సర్కారు జాగ్రత్తలు తీసుకుంది.

నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ చైర్ పర్సన్ గా ఉన్న అంగ్ సాన్ సూకీ ప్రజానేత. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఆమె మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఇది అక్కడి పాలకులకు నచ్చదు. దీంతో ఆమెను మొదటి నుంచి సైనిక పాలకులు తొక్కిపెడుతూ వచ్చారు. 1990 ఎన్నికల్లో ఆమె పార్టీకి 81 శాతం పార్లమెంటు సీట్లు వచ్చాయి. అయినా ఆమెకు అధికారాన్ని బదలాయించేందుకు సైనిక పాలకులు నిరాకరించారు. ఎన్నికల ముందు నుంచే ఆమెను నిర్బంధించగా.. 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు హౌస్ అరెస్ట్ లోనే ఉండిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles