Top LeT commander, 3 terrorists killed in Baramulla పీఎం మోడీ పర్యటనకు ముందు కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. 4 మిలిటెంట్ల హతం

Baramulla encounter terrorists hideout blown up 4 militants killed so far

Lashkar-e-Toiba, LeT, commander Mohammad Yousuf Dar, Yousuf Kantroo, militants, gunfight, Kashmir, Jammu and Kashmir, Baramulla district, Indian soldiers, Indian Army, policeman, Malwah village, Baramullah Encounter, terrorist attack. 4 millitants killed, Prime Minister Narendra Modi, jawan killed, Samba, Jammu district, Jammu and Kashmir, Crime

Another militant was killed in an encounter with security forces in Baramulla district of Jammu and Kashmir on Friday, police said, taking the toll to four in the over 24-hour-long operation. Top Lashkar-e-Taiba (LeT) commander Yousuf Kantroo, one of the longest-surviving militants in the Valley, was gunned down in the operation.

పీఎం మోడీ పర్యటనకు ముందు కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. 4 మిలిటెంట్ల హతం

Posted: 04/22/2022 03:37 PM IST
Baramulla encounter terrorists hideout blown up 4 militants killed so far

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలకు ఉగ్రమూకలకు మధ్య గురువారం నుంచి ఇవాళ్టి ఉదయం వరకు జరుగుతున్న భీకర కాల్పుల్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ జిల్లాలోని బారాముల్లా ప్రాంతం సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్లో భద్రతా బలగాల కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్ ను మట్టుబెట్టాయి. అయినా ఈ ప్రాంతంలో ఇంకా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దీంతో ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదలు హతమయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..  బారాముల్లా సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు మాల్వా ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భారత బద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు..  కాల్పులకు తెగబడడంతో భద్రతాదళాలు వెనువెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబా అగ్ర కమాండర్.. సుదీర్ఘకాలంగా బధ్రతా దళాలను తప్పించుకుని తిరుగుతున్న ఉగ్రవాద కమాండర్ యూసుఫ్ కంత్రూను భారత బలగాలు మట్టుబెట్టాయి.

ప్రత్యేక పోలీసు అధికారి, అతడి సోదరుడు, ఓ జవాను సహా పలువురు పౌరుల హత్యల్లో కంత్రూ ప్రమేయం ఉన్నట్టు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇక కంత్రూతో పాటు మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, ఇవాళ కూడా కొనసాగుతున్న కాల్పుల్లో మరో ఉగ్రవాది కూడా మరణించాడని తాజాగా పోలీసులు తెలిపారు. గత 24 గంటలుగా కొనసాగుతున్న ఎన్ కౌంటర్ లో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టామని పోలీసులు తెలిపారు. కాగా నిన్న ఉదయం ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు.

కాగా, ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాల్లో పర్యటించనున్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూకు 17 కిలోమీటర్ల దూరంలోని పాలి గ్రామంలో జరిగే భారీ సభలో ప్రసంగించనున్నారు. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన అనంతరం మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అయితే మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు ఇలా ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రధాని మోదీ భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles