Delhi makes wearing masks mandatory again మళ్లీ మొదలైన మాస్క్ ఆంక్షలు.. లేదంటే రూ.500 జరిమానా.!

Delhi makes wearing of mask compulsory ddma imposes rs 500 fine for violations

COVID-19, Coronavirus, covid-19 pandemic, Fourth wave of Covid-19, Covid-19 fourth wave, DDMA, delhi covid cases,COVID-19, Coronavirus, covid-19 pandemic, Fourth wave of Covid-19, Covid-19 fourth wave, DDMA, delhi covid cases

Covid-19 masks will once again be mandatory in New Delhi with a violation penalty of ₹500, the Delhi Disaster Management Authority decided on Wednesday in its meeting. The decision comes as the national capital is again witnessing a spike in the number of daily Covid-19 cases.

మళ్లీ మొదలైన మాస్క్ ఆంక్షలు.. లేదంటే రూ.500 జరిమానా.!

Posted: 04/20/2022 06:06 PM IST
Delhi makes wearing of mask compulsory ddma imposes rs 500 fine for violations

దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 2067. ఇది అంత‌కుముందు రోజు క‌న్నా 66% ఎక్కువ‌. కేసుల సంఖ్య స్వ‌ల్పంగా అయినా, క్ర‌మంగా పెరుగుతుండ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు ప‌లు సూచ‌న‌లు చేసింది. క‌రోనా కట్ట‌డికి ముందునుంచే జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. ముఖ్యంగా కేసుల సంఖ్య పెరుగుతున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హ‌రియాణా, మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, మిజోరం రాష్ట్రాల‌ను అప్ర‌మత్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. దాంతో, అప్ర‌మ‌త్త‌మైన ఆయా రాష్ట్రాలు ప‌లు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాయి.

రాష్ట్రస్థాయిలో రోజువారీ కేసుల సంఖ్య‌ను కేంద్రానికి క్ర‌మంత‌ప్ప‌కుండా అందించాల‌ని కేర‌ళ‌ను కోరింది. ఇక‌పై ప్ర‌జ‌లు త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మాస్క్ ధ‌రించ‌ని ప‌క్షంలో రూ. 500 జ‌రిమానా విధిస్తామ‌ని తెలిపింది. పాఠ‌శాల‌లు ఆఫ్‌లైన్ విధానంలో కొన‌సాగుతాయ‌ని, అయితే, త‌ర‌చు చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం, మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం వంటి కోవిడ్ ప్రొటొకాల్‌ను విధింగా పాటించాల‌ని పేర్కొంది. దేశ రాజ‌ధాని ప్రాంత ప‌రిధిలోని త‌మ జిల్లాల్లోనూ మాస్క్‌ను త‌ప్ప‌ని స‌రి చేస్తూ హ‌రియాణా, ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రాలు క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశాయి.

దేశ‌వ్యాప్తంగా గ‌త బుధ‌వారం యాక్టివ్ కేసుల సంఖ్య 10,870 ఉండ‌గా, వారం రోజుల్లో ఈ సంఖ్య 1470 పెరిగి 12,340కి చేరింది. పాజిటివిటీ రేట్ 8 రోజుల్లో 0.44% పెరిగింది. ఇది ఏప్రిల్ 12న 0.21గా ఉంది. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్న ఇత‌ర దేశాల‌తో పోలిస్తే ఈ పెరుగుద‌ల స్వ‌ల్ప‌మే అయినా.. గ‌త ఉదాహ‌ర‌ణ‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. రాష్ట్రంలోని గౌత‌మ‌బుద్ధ న‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం న‌మోదైన 107 కొత్త కేసుల్లో 33 కేసులు చిన్నారుల‌వే కావ‌డం ఉత్త‌ర ప్ర‌దేశ్ అధికారుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఈ జిల్లా దేశ రాజ‌ధాని ఢిల్లీకి ద‌గ్గ‌ర‌లో ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles