Legendary director Tatineni Rama Rao passes away ప్రముఖ దర్శకుడు టి.రామారావు కన్నుమూత

Veteran director tatineni rama rao passes away at 83 in chennai

T Rama Rao, tatineni ramarao, director Tatineni Rama Rao, t ramarao passes away, t rama rao dies, t rama rao director, t ramarao producer, Chennai hospital, age-related ailments, Kapileshwarapuram, Krishna district, Andhra Pradesh, Tollywood, movies, Entertainment

Renowned director and producer Tatineni Rama Rao (T Rama Rao) breathed his last in the wee hours of April 20, 2022, in Chennai. He was admitted to a private hospital for age-related illness. He was 83 years old. Rama Rao's family members informed the news of his demise with a statement. His final rites will take place today (April 20) evening in Chennai.

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు టి.రామారావు కన్నుమూత

Posted: 04/20/2022 11:27 AM IST
Veteran director tatineni rama rao passes away at 83 in chennai

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సినీనిర్మాత, ఏషియన్ గ్రూప్ సినిమా అధినేత నారాయణ్ దాస్ నారంగ్.. కన్నుమూసి 24 గంటలకు కాకుండానే మరోమారు అదే సినీపరిశ్రమకు చెందిన ప్రముఖలు దర్శకుడు తాతినేని రామారావు ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రామారావు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.

1966లో ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తాతినేని 70కి పైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో  యమగోల, జీవనతరంగాలు, దొరబాబు, ఆలుమగలు, అనురాగదేవత, న్యాయానికి సంకెళ్లు వంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే, రాజేంద్రప్రసాద్‌తో గోల్‌మాల్ గోవిందం, సూపర్‌స్టార్ కృష్ణతో అగ్నికెరటాలు వంటి సినిమాలను తెరకెక్కించారు. తాతినేని మృతికి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

తాతినేని రామారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. టీ. రామారావు గొప్ప దర్శకుడని సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన ఆయ‌న ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరమ‌ని చెప్పారు. తాతినేని మరణవార్త త‌న‌ను ఎంతగానో కలచివేసిందని చెప్పారు. త‌న తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి చరిత్రలో నిలిచిపోయే 'యమగోల' వంటి విజయవంతమైన చిత్రాలు తీశార‌ని చెప్పారు. ఆయన దర్శకత్వంలో తాను హీరోగా 'త‌ల్లిదండ్రులు' అనే సినిమాలో న‌టించాన‌ని గుర్తుచేసుకున్నారు.

ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిందని తెలిపారు. తాతినేని నిర్మాతల‌ పక్షాన నిలబడేవార‌ని, వారికి డబ్బులు మిగలాలని ఆలోచించే వార‌ని చెప్పారు. అలాగే సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడేవారు కాద‌ని అన్నారు. బాలీవుడ్‌ లోనూ ఆయ‌న‌ హిట్ సినిమాలు తీసి అక్కడ కూడా విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నార‌ని బాల‌కృష్ణ చెప్పారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. తాతినే‌ని కుటుంబ సభ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles