45 arrested After Rampage In Hubballi police Station స్టేటస్ వీడియో తెచ్చిన తంట.. పోలిస్ స్టేషన్ పై దాడి..

Over 45 arrested 12 cops injured after stones pelted at hubli police station in karnataka

hubli attack, hubli stone pelting, stone pelting at hubli, hubli police station attack. Labhu Ram, Basavaraj Bommai, Araga Dnyanendra, Home minister, Union minister Shobha Karandlaje, Karnataka, politics

The Karnataka police have arrested 46 people so far after a mob pelted stones at the Old Hubli Police Station. The incident that happened on Saturday night resulted in the injury of 12 policemen, out of which 2 are in critical condition.

స్టేటస్ వీడియో తెచ్చిన తంట.. పోలిస్ స్టేషన్ పై దాడి.. 68 మంది అరెస్టు..

Posted: 04/18/2022 11:38 AM IST
Over 45 arrested 12 cops injured after stones pelted at hubli police station in karnataka

సోషల్ మీడియా ఎంత ప్రభావవంతంగా మారిందో.. ఎలా దాని ప్రభావన స్థానికులను పడేట్లు చేస్తుందో అన్న విషయం ఇప్పటికే పలు వీడియోల ద్వారా వ్యక్వమైంది. కాగా, ఏకంగా పోలిస్ స్టేషన్ పైనే స్థానికులను ఉసిగోల్పేలా చేస్తోందని తాజాగా జరిగిన ఘటన నిరూపిస్తోంది. ప్రజల్లో శాంతిభద్రతలను నిత్యం కాపాడాల్సిన బాధ్యత ఉన్న పోలీసుస్టేషన్ పైనే ఓ మూక అకస్మాత్తుగా వచ్చి దాడి చేసింది. రాళ్లు రువ్వింది. ఈ దాడిలో కనీసం 12 మంది పోలీసులు తీవ్రగాయాలపాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. ఇంతకీ ఈ దాడికి కారణమేంటీ అంటే స్టేటస్‌గా పెట్టుకున్న వీడియో.

ఓ వ్యక్తి చెందిన స్టేటస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి చివరికి పోలీస్ స్టేషన్‌పై దాడికి కారణమైంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన ఈ ఘటన హింసకు దారితీసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ యువకుడు ఓ ప్రార్థనా మందిరంపై కాషాయ జెండాను ఎగురవేస్తున్నట్టుగా ఉన్న ఎడిట్ చేసిన వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ వీడియో ఓ గంటలోనే వైరల్ అయింది. దీంతో అతడిని అరెస్ట్ చేయాలంటూ కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరో వైపు, వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఓ వర్గానికి చెందినవారు డిమాండ్ చేశారు.

అంతటితో ఆగని స్థానికులు.. ఒకరు ఒకరుగా పోగై.. సుమారు వెయ్యిమందికి పైగా అర్ధరాత్రి వేళ హుబ్బళ్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలను ధ్వంసం చేశారు. దాడిలో ఓ ఆలయం అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాదు, సీఐ సహా 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపు చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. వివాదాస్పద వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన వారిలో 45 మందిని అరెస్ట్ చేశారు. వారి దాడిలో గాయపడిన నలుగురు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles