TTD allows devotees for sarva darshanam without tokens కరోనా తరువాత ఈ రోజునే రికార్డుస్థాయిలో భక్తుల దర్శనం

Ttd allows devotees for sarva darshanam without tokens

Tirumala, Tirupati, Tirumala Tirupati Devasthanams, TTD, TTD Board chairman, YV Subba Reddy, Dharma Reddy, Sarva Darshan tickets, Seegra Darshan tickets, Arjitha Sevas, VIP Break danshan, Darshan tickets, Arjitha Sevas, Lord Venkateshwara Darshan, Tirumala Balaji, Andhra Pradesh, Devotional

Tirumala Tirupati Devasthanam sends Good news to Lord Venkateshwara Swamy Devotees. Amid the flock situation at Sarva Darshan token centers took place on saturday, the TTD hereafter sending the devotees in the general queue for SriVari Darshan in sarva darshan without tokens.

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టోకెన్ల రహితంగానే స్వామివారి సర్వదర్శనం

Posted: 04/14/2022 02:52 PM IST
Ttd allows devotees for sarva darshanam without tokens

తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం సామాన్యభక్తులకు కూడా క్రమపద్దతిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన సర్వదర్శనం టోకెన్ల విధానం లోపభూయిష్టంగా వుందని విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో సర్వదర్శనం టోకన్ల కేంద్రాల వద్ద మంగళవారం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. దీంతో స్వామివారిని దర్శించుకునే టోకన్ల కోసమే తాము ప్రాణాలు పన్నంగా పెట్టి పోరాడాల్సి వస్తుందని వాపోయారు.

ఇక స్వామివారిని దర్శించుకునేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదర్కోవాల్సివస్తుందోనని భక్తులు వాపోయారు. అన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం తెలియని భక్తులు కూడా కరోనా తరువాత దర్శనాలు ప్రారంభం నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. భక్తుల నుంచి భగవంతుడిని దూరం చేస్తున్నారన్న విమర్శలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి తొక్కిసలాటకు అస్కారం లేకుండా.. టోకన్లతో పనిలేకుండా భక్తులు నేరుగా శ్రీవారి సర్వదర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది.

ఈ మేరకు టీడీపీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ‘‘కరోనా సమయంలో రెండు నెలలపాటు ఎస్ఎస్‌డీ టోకెన్లను ఆన్‌లైన్‌లో ఇచ్చాం, దీనివల్ల గ్రామీణ, కంప్యూటర్ పరిజ్ఞానం లేని భక్తులు నష్టపోతున్నారని గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలో మార్చి 1 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు టోకెన్ల విధానాన్ని చక్కగా నిర్వహించామన్నారు. టోకెన్ల కౌంటర్ల వద్ద తోపులాటపై మాట్లాడుతూ.. 9, 10, 11 తేదీల్లో రద్దీ నేపథ్యంలో 8వ తేదీనే మూడు రోజులకు సరిపడా టికెట్లు ఇచ్చామని, కాబట్టి కౌంటర్లు మూసేశామన్నారు.

తిరిగి బుధ, గురు, శక్రవారాలకు గాను మంగళవారం లక్ష టోకెన్లు జారీ చేయాలని అనుకున్నామన్నారు. శనివారం టోకెన్లు దొరకనివారు తిరుపతిలోనే ఉండిపోయారని, ఆ తర్వాత నాలుగు రోజులు సెలవులు కావడంతో మరింత మంది భక్తులు తిరుపతికి చేరుకున్నారు. దీంతో అప్పటికే ఉన్న భక్తులకు తోడు కొత్తగా వచ్చిన భక్తులు సర్వదర్శన టోకన్ల కోసం తిరుపతి చేరుకుని టోకన్ కేంద్రాల వద్దే రాత్రి నుంచి వేచిఉండటంతో.. భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఎలాగైనా టోక్లన్లు పోందాలని బయటకు వచ్చే దారుల్లోంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు.

ఇక కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత కాలం నుంచి ఇప్పటివరకు తొలిసారిగా తిరుమల శ్రీవారిని బుధవారం రోజున రికార్డుస్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. ఈ ఒక్క రోజే ఏకంగా 88,748మంది భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. సర్వదర్శన క్యూ లైను ద్వారా స్వామివారిని 46,400మంది భక్తులు దర్శించుకోవ‌డం గ‌మ‌నార్హం. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైను ద్వారా 25,819 మంది భక్తులు, వర్చువల్ సేవా టిక్కెట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపుల ద్వారా 16,529 మంది భక్తులు స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles