Akbaruddin Owaisi Acquitted In Two Hate Speech Cases అక్బరుద్దీన్ కు భారీ ఊరట.. రెండు కేసులలో నిర్దోషిగా తేల్చిన కోర్టు

Big relief aimim s akbaruddin owaisi acquitted in two hate speech cases from 2012

AIMIM MLA Akbaruddin Owaisi, public representatives court judgment, hate speech cases, Akbaruddin Owaisi,Akbaruddin Owaisi hate speech case, AIMIM Asaduddin Owaisi, AIMIM MLA Akbaruddin Owaisi hate speech case, court acquitted Akbaruddin, court acquitted mim mla Akbaruddin, mim mla Akbaruddin acquitted, hate speech case, Nizamabad, Nirmal, AIMIM, Public representatives court, mim mla Akbaruddin latest news, Telangana, Crime

AIMIM leader Akbaruddin Owaisi has been acquitted by a special court in two criminal cases against him for alleged hate speeches today. Akbaruddin Owaisi, floor leader of AIMIM in the Telangana Legislative Assembly, was facing cases for his alleged hate speeches delivered at Nizamabad and Nirmal in Telangana in December 2012.

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు భారీ ఊరట.. రెండు కేసులలో నిర్దోషిగా తేల్చిన కోర్టు

Posted: 04/13/2022 05:08 PM IST
Big relief aimim s akbaruddin owaisi acquitted in two hate speech cases from 2012

మజ్లిస్ పార్టీ అగ్రనేత.. తెలంగాణ మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి నాంపల్లి కోర్టులో భారీ ఊరట లభించింది. హిందూ దేవుళ్లను, గోమాతను తూలనాడుతూ ఆయన చేసిన విద్వేషపూరిత ప్రసంగాలమేరకు ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే ఇవాళ తుది తీర్పును వెలవరించిన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆయనకు భారీ ఊరట కల్పించింది. అక్బరుద్దీన్ పై నమోదైన కేసులను కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ కేసులో అక్బరుద్దీన్ ఓవైసిని నిర్దోషిగా తేల్చింది.

దీంతో నిజామాబాద్ సహా నిర్మల్ లో విద్వేషపూరిత ప్రసంగాలపై అభియోగాలు మోపబడిన రెండు కేసులను న్యాయస్థానం కోట్టివేసింది. ఈ రెండు విద్వేషపూరిత ప్రసంగాల కేసులలో ఆధారాలు చూపించలేదన్న న్యాయస్థానం.. దేశ సార్వ‌భౌమ‌త్వం దృష్ట్యా భ‌విష్య‌త్‌లో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని అక్బరుద్దీన్ ను అదేశించింది. అంతేకాదు ఈ రెండు కేసులను కొట్టివేస్తున్న నేపథ్యంలో మజ్లిస్ అభ్యర్థులు, పార్టీ నేతలు సంబురాలు చేసుకోవద్దని కూడా న్యాయస్థానం సూచించింది.

2013లో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఫ్యలపై తీవ్రస్థాయిలో మండిపడి.. అక్బరుద్దీన్ పై కేసులు నమోదయ్యేలా చేశారు. 2012 డిసెంబర్ 8న నిజామాబాద్‌లో, 2012 డిసెంబర్‌ 22న నిర్మల్‌లో అక్బరుద్దీన్ విద్వేషపూరిత ప్రసంగం చేశారు, దీంతో జనవరి 2 2013న అక్బరుద్దీన్‌పై కేసులు నమోదయ్యాయి. నిర్మల్, నిజామాబాద్ పోలీసులు.. 2013 జనవరి 2న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2013 జనవరి 8న అక్బరుద్దీన్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు తరలించారు. అక్బర్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

అక్బరుద్దీన్ ఓవైసీ 40 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. 2013 ఫిబ్రవరి 16న జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. నిజామాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్‌స్టేషన్‌, ఢిల్లీలో నమోదైన కేసులను 2013 జనవరి1న అప్పటి ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. నిర్మల్ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. నిజామాబాద్ కేసులో 41 మంది , నిర్మల్ కేసులో 33 మంది సాక్షులను విచారించారు. 2016లో... సీఐడీ, నిర్మల్ పోలీసులు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఏ-1గా అక్బరుద్దీన్, ఏ-2 గా యాయా ఖాన్‌ను చేర్చారు. అక్బరుద్దీన్ వీడియో ఫుటేట్‌ను సీఎఫ్​ఎస్​ఎల్​కు పంపించి పరీక్షించారు. ప్రసంగంలో గొంతు అక్బరుద్దీన్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ తేల్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles