Six workers killed in blast at chemical factory in Gujarat కాంగ్రెస్ సీనియర్ నేతను ప్రశ్నించిన ఈడీ..

Agustawestland case court summons ex defence secy four ex iaf officials

National Herald, Mallikarjun Kharge, Enforcement Directorate, VVIP chopper scam, CBI, AgustaWestland, Central Bureau of Investigation, CBI special court, AgustaWestland Case, Central Bureau of Investigation, VVIP Chopper scam, Indian Air Force officials, Special Judge Arvind Kumar, supplementary chargesheet, former defence secretary Shashi Kant Sharma, FinmeccanicaVVIP chopper scam latest news, VVIP chopper scam updates

A Special Court on Monday issued summons against former Defence Secretary and former Comptroller and Auditor General (CAG), Shashi Kant Sharma and Four India Airforce (IAF) retired officials in AgustaWestland VVIP Chopper alleged scam case.

కాంగ్రెస్ సీనియర్ నేతను ప్రశ్నించిన ఈడీ.. ఆ నలుగురికి నోటీసులు

Posted: 04/11/2022 06:15 PM IST
Agustawestland case court summons ex defence secy four ex iaf officials

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక అవినీతి కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు షాక్‌ తగిలింది. ఈ కేసులో రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖార్గేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు అందించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించడంతో ఇవాళ ఆయన ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో హాజరయ్యరు. ఈ క్రమంలో ఆయనను నేషనల్ హెరాల్డ్ పత్రిక అవినీతి కేసులో ఈడీ ప్రశ్నించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్​మెంట్​ను రికార్డు చేసినట్లు వెల్లడించాయి. విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయనను పిలిచినట్లు స్పష్టం చేశాయి.

ఇదిలా ఉండగా.. అగస్టా వెస్ట్‌లాండ్‌ చాపర్‌ కుంభకోణం కేసులో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ కాగ్‌ శశికాంత్‌ శర్మకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నలుగురు రిటైర్డ్‌ అధికారులతో పాటు అంతకుముందు సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితులందరికీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు పంపింది. వీరంతా ఏప్రిల్‌ 28వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో రక్షణశాఖ మాజీ కార్యదర్శి శశికాంత్‌ శర్మతో పాటు నలుగురు ఐఏఎఫ్‌ మాజీ అధికారులపై మార్చి 17న అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసిన సీబీఐ చార్జ్​షీట్ రూపొందించింది.

ఇక ఈ డీల్ సమయంలో వివిధ హోదాల్లో పనిచేసిన నలుగురు అధికారుల (ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ జస్బీర్‌ సింగ్‌ పనేసర్‌, డిప్యూటీ చీఫ్‌ టెస్ట్‌ పైలట్‌ ఎస్‌.ఎ.కుంతే, వింగ్‌ కమాండర్‌ థామస్‌ మాథ్యూ, గ్రూప్‌ కెప్టెన్‌ ఎన్‌.సంతోష్‌) పేర్లు కూడా నమోదు చేసింది. అయితే, 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీకి అనుకూలంగా పనిచేసేందుకు వీరంతా అవినీతికి పాల్పడ్డారన్న వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఈ ఒప్పందం చేసుకోగా.. ఎన్​డీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles