cricketer shravani house demolished by GHMC officials క్రికెటర్ శ్రావణి ఇంటిని కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు

Woman cricketer shravani house demolished by greater hyderabad municipal corporation officials

Bhogi Shravani house demolished, woman cricketer house demolished by GHMC, GHMC officials demolished cricketer shravani house, GHMC notices to Shravani Parents, Repairs made to the back wall of House, Bhogi Shravani fatherr Mallesh, Bhogi Shravani, woman cricketer, GHMC officials, notices, Repairs, Plumber, Mallesh, Tukaramgate, Community Hall, Secundrabad, Telangana

Team India woman cricketer Bhogi Shravani house demolished by Greater Hyderabad Municipal corporation officials today. With the notices of GHMC officials the cricketer family had made necessary repairs. Without Verifying the GHMC Officials today had demolished sravani house even after repeated appeals from the cricketer and her parents.

మహిళా క్రికెటర్ శ్రావణి ఇంటిని కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు

Posted: 04/08/2022 05:45 PM IST
Woman cricketer shravani house demolished by greater hyderabad municipal corporation officials

తెలంగాణ ప్రభుత్వం తీరు చాలా విచిత్రంగా కనిపిస్తోంది. అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్నట్లు.. దేశంలో కోసం ఆడుతున్న ఓ క్రీడాకారిణిని తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా అప్పట్లో నియమించారు. మరో క్రీడాకారిణి ప్రపంచపోటీలలో సత్తా చాటిందని అత్యంత విలువైన స్థలంతో పాటు నగదు బహుమతులు కూడా ఇచ్చారు. అయితే వారి మాదిరిగానే దేశం కోసమే ఆడుతున్న ఓ క్రీడాకారిణి ఇంటిని మాత్రం కూల్చివేశారు. సికింద్రాబాద్‌లో మహిళా క్రికెటర్‌ ఇల్లు కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మహిళా క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుకారాంగేట్ పరిధిలో గత 35 ఏళ్లుగా క్రికెటర్ భోగి శ్రావణి తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తుంది. ఆమె తండ్రి బి. మల్లేష్ ప్లంబర్ గా పనిచేస్తుంటారు. అయితే వారు నివాసముంటున్న ఇంటి వెనుక గోడ ఏక్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఇటీవలే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు ఇచ్చిన తరువాత తాము తమ ఇంటికి మరమ్మతులు చేశామని చెప్పినా అధికారులు పెడచెవిన పెట్టారు.

క్రితం రోజు సాయంత్రం డెమాలిషన్ స్వాడ్ తో శ్రావణి ఇంటికి చేరుకున్న అధికారులు.. శ్రావణి సహా అమె తల్లిదండ్రులు అధికారులను మరమ్మతులు చేయించామని.. కావాలంటే చూడమని చెప్పినా వినిపించుకోకుండా ఇంట్లోని సామాగ్రిని బయట పడేసిన సిబ్బంది.. వారింటిని కూల్చివేశారు. తమ కళ్లముందే మూడున్నర దశాబ్దాల తమ స్వర్గం చిధ్రం కావడంతో శ్రావణి సహా అమె కుటుంబసభ్యులు తీవ్రంగా బాధపడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు కనీసం తాము చెబుతున్నది ఆలకించకుండా ఇంటిని కూల్చివేయడంపై అమె తీవ్ర అవేధన వ్యక్తం చేశారు.  

ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే తాము ఇంటికి మరమ్మత్తులు చేసినట్టు తెలిపారు. అదేమీ పట్టించుకోకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ఈరోజు.. తమ ఇంటికి వచ్చి వస్తువులు బయటపడేసి ఇంటిని కూల్చివేశారని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, ఈ నెల 15వ తేదీ నుంచి జరిగే మహిళల టీ20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉందన్న శ్రావణి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్‌ ఆడాలా..? లేక ఇంటి కోసం పోరాడాలా..? అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, శ్రావణి ఇండియా తరఫున మ్యాచ్‌లను ఆడుతోంది.

కాగా, ఈ ఘటన వెనుక తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కొడుకు రామేశ్వర్ గౌడ్ హస్తం ఉందని శ్రావణి ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీచేసిన తరువాత స్థానిక ఎమ్మెల్యే పద్మారావు తనయుడు రామేశ్వర్ తన తండ్రి కార్యాలయానికి పిలిపించి.. తమను బెదిరించాడని అరోపించారు. రూ. 2 లక్షలు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని అన్నాడని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేయడం దారుణమని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ ఆడాలో? లేక ఇంటి కోసం పోరాడాలో? అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles