Cargo plane splits in 2 at Costa Rica Airport విమానంలో సాంకేతిక లోపం.. ల్యాండింగ్ చేస్తుండగా రెండు ముక్కలు..

Dhl boeing plane crash lands in costa rica splits in two after emergency landing

costa rica, San Jose, Juan Santamaria International Airport, cargo plane crash, dhl cargo plane crash, san jose plane crash, costa rica's firefighters, Plane Crash, Boeing, Costa Rica, Guatemala, Aviation, DHL, Cargo, Plane, Emergency Landing, Plane crash, Boeing, Costa Rica, Aviation

The plane that landed in Costa Rica's San Jose airport split in two. However, no injuries were reported as a result of the mishap. A Boeing-757 cargo plane belonging to the German logistics company DHL took off from Costa Rica with cargo. Shortly later, a technical fault on the plane caused it to return to the airport for an emergency landing. The plane was descending when it skidded off the runway by accident.

ITEMVIDEOS: విమానంలో సాంకేతిక లోపం.. ల్యాండింగ్ చేస్తుండగా రెండు ముక్కలు..

Posted: 04/08/2022 03:24 PM IST
Dhl boeing plane crash lands in costa rica splits in two after emergency landing

తృటిలో పెనుప్రమాదం తప్పింది. రన్ వేపై కార్గో బోయింగ్ విమానం రెండు ముక్కలైంది. అది డీహెచ్ఎల్ కు చెందిన కార్గో విమానం కావడం.. పైలెట్లు సరక్షితంగా కిందకు దిగడంతో ప్రాణనష్టం మాత్రం జరగలేదు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతికసమస్య తలెత్తడంలో పైలెట్ ఏటీఎస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించి.. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సరిగ్గా ల్యాండ్ అయిన కొద్ది క్షణాలకే విమానంలో రెండు ముక్కలైంది. కోస్టారికాలో కార్గో విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైంది.

జర్మన్ లాజిస్టిక్స్ దిగ్గజం డీహెచ్ఎల్  కు చెందిన బోయింగ్ 757 విమానం కోస్టారికా లోని సాన్ జోస్ నగరంలోని జువాన్ శాంటామారియా అంతర్జాతీయ విమానాశ్రమం నుంచి గ్వాటెమాలలోని గ్వాటెమాల నగరంలోని ఎయిర్ పోర్ట్ బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానంలోని హైడ్రాలిక్ సిస్టమ్ లో సాంకేతిక సమస్య ఉతన్నమయ్యనట్టు గుర్తించిన పైలట్లు విమానాంలోని  పరిస్థితిని స్థానిక కోస్టారికా విమానాశ్రయ సిబ్బందికి వివరించారు. దీంతో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అనుమతినిచ్చారు.

విమానాశ్రయం అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించడంతో తిరిగి వెనక్కి వచ్చిన డీహెఛ్ఎల్ బోయింగ్ విమానం.. అత్యసవర ల్యాండింగ్ చేసింది. అలా ల్యాండ్ అయ్యి రన్ వైపై పరుగులు తీస్తున్న సమయంలో పట్టుకోల్పోయి పక్కకు ఒరిగిపోయి రెండు ముక్కలైంది. ఆ సమయంలో విమానం నుంచి విడిపోయిన వెనుక బాగంలో పొగలతో పాటు మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన  అగ్నిమాపక  సిబ్బంది విమానం నుంచి వెలువడుతున్న పొగలను ఆర్పివేశారు. దీంతో శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా అధికారులు మూసివేశారు.ఈ ప్రమాదం నుంచి పైలట్లు క్షేమంగా బయటపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Plane Crash  Boeing  Costa Rica  Aviation  DHL  Cargo  Plane  Emergency Landing  Plane crash  Boeing  Costa Rica  Aviation  

Other Articles