XE variant of Covid-19 'detected' in Mumbai మళ్లీ కరోనా అలెర్ట్.. ముంబైలో బయటపడిన ఎక్సఈ వేరియంట్

Maharashtra health ministry makes big statement on first xe variant case detected in mumbai

Coronavirus, Covid, Covid vaccine, First Omicron XE case in India, Omicron XE variant case in Maharashtra, first omicron XE variant case in Mumbai, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms, corona update in india, lockdown news, coronavirus news, norovirus, karnataka news, india coronavirus, coronavirus in india, covid cases in india in last 24 hours today, omicron, Omicron variant, omicron variant covid, New variant Omicron, omicron virus, omicron virus symptoms, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

A day after reports claimed that a new coronavirus subvariant ‘XE’ has made its way to India and the first case was detected in Mumbai, Maharashtra Health Minister Rajesh Tope assured people that there is no need to not panic as the state health department is yet to arrive on any confirmation on the same.

దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. ముంబైలో బయటపడిన ఎక్సఈ వేరియంట్

Posted: 04/07/2022 11:25 AM IST
Maharashtra health ministry makes big statement on first xe variant case detected in mumbai

కరోనా పురుడుపోసుకున్న చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్ ఉపపరివర్తన ఎక్స్ఈ వేరియంట్ విజృంభిస్తూ.. ఆ దేశంలోని పలు కీలకమైన నగరాలతో పాటు వ్యాపారనగరాల్లోనూ లాక్ డౌన్ కు కారణమైన విషయం తెలిసిందే. కాగా తాజాగా మన దేశంలోనూ ఈ వేరియంట్ ఉనికి బయటపడిందన్న వార్తలు దేశప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే కరోనా మూడు దశల్లో ఏకంగా నాలుగు లక్షల పైచిలుకు మంది ప్రాణాలను ఈ ప్రాణాంతక మహమ్మారి బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక పలువురిలో అరోగ్యపరంగానూ తీవ్ర ప్రభావం చాటింది. ఈ నేపథ్యంలో మరోమారు ప్రాణాంతక ఎక్స్ఈ వేరియంట్ దేశంలోకి ప్రవేశించిందన్న వార్త ప్రజలను కలవరపరుస్తోంది.

ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ గా నామకరణం చేసిన ఈ ఒమిక్రాన్ బి 1ఏ బి2ఏ వేరియంట్ల ఉపపరివర్తనమే ఈ వేరియంట్. కాగా, ఈ వేరియంట్ కు సంబంధించిన తొలి కేసు మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో వెలుగు చూసింది. ఈ మేరకు మహారాష్ట్ర బ్రిహన్ ముంబై కార్పోరేషన్ అధికారులు తొలుత ప్రకటించిన తరువాత.. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కూడా ధృవీకరించారు. బ్రిట‌న్‌లో జ‌న‌వ‌రి 19న ఈ వేరియంట్ తొలి కేసు న‌మోదు కాగా.. తాజాగా భార‌త్‌లోనూ బుధ‌వారం ఈ వేరియంట్‌కు చెందిన తొలి కేసు న‌మోదైంది.

క‌రోనా కొత్త వేరియంట్ కేసు న‌మోదైన నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం దేశంలో హై అలర్ట్ ప్ర‌క‌టించింది. మరోసారి రోగి నుంచి సేకరించిన శాంపుల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తరువాత ఇవి ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ తో మ్యాచ్ కావడం లేదని చెప్పింది. అయితే ఇది 2020లో విజృంభించిన కప్పా వేరియంట్ గా పేర్కోంది. ఈ వేరియంట్ ను దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళా నుంచి సేకరించినట్టుగా పేర్కోంది. అమె దేశంలోకి వచ్చినప్పుడు కరోనా టెస్ట్ చేయగా, అమెకు నెగిటివ్ రిపోర్టు వచ్చిందని, కాగా, ఇటీవల అమెను పరీక్షించగా అమెకు పాజిటివ్ రిపోర్టు రావడంతో హోటల్ లో క్వారంటైన్ లో పెట్టామని తెలిపారు. కాగా, కొత్త వేరియంట్‌పై అధ్య‌య‌నం జ‌రుగుతోంద‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఈ వేరియంట్‌కు సంబంధించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles