WhatsApp voice message phishing attack వాట్సాఫ్ వాయిస్ మెసేజ్ తెరిచారో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ..!

Whatsapp voice message phishing emails push info stealing malware

Information Stealer, Malware, Phishing, Voice Message, Voicemail, WhatsApp, Security, InfoSec, Computer Security, computers, windows, linux, mac, support, tech support, spyware, malware, virus, security, Information Stealer, Malware, Phishing, Voice Message, Voicemail, WhatsApp,virus removal, malware removal, computer help, technical support, crime news

A new WhatsApp phishing campaign impersonating WhatsApp's voice message feature has been discovered, attempting to spread information-stealing malware to at least 27,655 email addresses. This phishing campaign aims to lead the recipient through a series of steps that will ultimately end with the installation of an information-stealing malware infection, opening the way to credential theft.

వాట్సాఫ్ వాయిస్ మెసేజ్ తెరిచారో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ..!

Posted: 04/06/2022 08:15 PM IST
Whatsapp voice message phishing emails push info stealing malware

పైన దగా, కింద దగా, కుడిఎడమల దగా దగా అని ప్రముఖ కవి శ్రీశ్రీ అన్నారు. ఆయనే ఇప్పటి కాలంలో ఉంటే మాత్రం ఇప్పడు జరుగుతున్న స్కామ్ లను, సైబర్ దాడులను చూసి ఏమనేవారో. ఇందుకలదు అందుకలదన్న సందేహము వలదు ఎందెందు వెతికినా సైబర్ నేరగాళ్లు గలరు అని చెప్పకనేచెప్పేవారేమో. సాంకేతిక విప్లవంతో అందుబాటులోకి వచ్చిన ప్రపంచాన్ని నిజానికి శాసిస్తున్నది సైబర్ నేరగాళ్లు మాత్రమే అంటే అతిశయోక్తి కాదేమో. డిజిటలైజేషన్ పేరుతో జరుగుతున్న అభివృద్ది అద్దాల మేడను తలపిస్తోంది.

ఏ చిన్న రాయిముక్క వచ్చి తగిలినా.. లేక ఎవరైనా విసిరినా.. అద్దాల మేడ తునాతునకాలు కావడం ఖాయం. తగు రక్షణ లేని ఫోన్లు, తగు అవగాహన లేని వినియోగదారులు, భద్రత సాఫ్ట్ వేర్ లేని స్మార్ట్ ఫోన్లు కూడా అద్దాల మేడలే. అనుక్షణం ఏదో విధంగా మీ స్మార్ట్ ఫోన్ లోకి చోరబడి మీ రహస్య సమాచారాన్ని తెలుసుకుని మీ బ్యాంకు ఖాతాలను నొక్కేయడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కరడు గట్టిన ముఠాలు పనిచేస్తున్నాయి. తాజాగా మరో పంథాలో స్కామర్‌లు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడానికి వచ్చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్తా.

వాట్సాప్ వాయిస్ నోట్‌లను వినియోగిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. కాబట్టి వాట్సాప్​ను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త సమస్య గురించి తెలుసుకుని మీరు కూడా జాగ్రత్త పడండి. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఆర్మోర్‌బ్లాక్స్‌లోని నిపుణులు ఇటీవలె ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రైవేట్ వాట్సాప్ వాయిస్ నోట్‌తో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని స్పష్టం చేశారు. వాయిస్ నోట్​తో సైబర్ నేరగాళ్లు మాల్వేర్​ను పంపిస్తారు. మీరు వాయిస్​ నోట్​ను క్లిక్ చేయగానే.. అది మిమ్మల్ని వెబ్​పేజీకి తీసుకువెళ్తుంది. వెంటనే అది మీ ఫోన్​లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది.

దీనివల్ల మీ ఆర్థికపరమైన ఆధారాలు బహిర్గతం అవుతాయి. ఈ మెసేజ్ సాధారణంగా 'కొత్త ఇన్‌కమింగ్ వాయిస్ మెసేజ్' పేరుతోనే ఉంటుంది. ఇప్పటికే 28,000 కంటే ఎక్కువ మంది వాట్సాప్​ ఇన్‌బాక్స్‌లకు ఇది చేరినట్లు గుర్తించారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, రిటైల్ సంస్థలను లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఫిల్టర్‌లను కూడా ఇవి సులభంగా దాటేస్తున్నాయి. ఈ దాడుల బారిన పడకుండా ఉండడానికి.. మీరు మీ పరికరంలో భద్రతా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అనుమానాస్పద ఇమెయిల్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులు పంపే సందేశాలను లేదా తెలియని పేర్లతో వచ్చే సందేశాలను తెరవకుండానే బ్లాక్ చేసేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles