Man Charged by a Moose భారీ దుప్పి దాడి నుంచి తృటితో తప్పించుకున్న వ్యక్తి

Man charged by a moose as he tries to check the mail

mail, massive moose, massive moose charged man, massive moose charged dog, massive moose staring man, massive moose across the street, moose charged man and his dog, Reecey barked moose, dog lunged at the moose, massive moose attacks in alaska, massive moose attack, Fairbanks, Alaska, USA, Crime

Went to check the mail and I did not realize a moose was staring me down from across the street. It began to charge me and my dog Reecey barked and let me know we were in danger! She lunged at the moose then circled back and we both high-tailed it inside!

ITEMVIDEOS: భారీ దుప్పి దాడి నుంచి తృటితో తప్పించుకున్న వ్యక్తి

Posted: 03/30/2022 08:59 PM IST
Man charged by a moose as he tries to check the mail

అగ్రరాజ్యం అమెరికాలో దుప్పిలు దాడికి తెగబడటం సర్వసాధారణంగా మారింది. దాదపుగా టన్నుకు పైగా బరువుతో ఉండే భారీ దుప్పిలు అమెరికా వాసులను అందోళనకు గురిచేస్తున్నాయి. అంతేకాదు ఏకంగా ఇవి ఆరు అడుగుల మేర ఎత్తు ఉండటంతో మనుషలపై దాడి చేసి.. వారిని ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. ఏదోలే దాని మానాన అది ఉంది.. మన మానాన మన పని చేసుకుందా అంటే.. కుదరదు. ఈ దుప్పిలు ఎలాంటివంటే అవి ఎక్కడి నుంచో గమనించి మరీ టార్గెట్ చేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి అకస్మాత్తుగా దాడి చేస్తాయి.

వీటి భారిన పడినవారిలో అనేక మంది అమెరీకన్లు గాయాలతో బయటపడగా, కొందరు మాత్రం ప్రాణాలను సైతం కోల్పోయారు. సాధారణంగా మనుషులు, శునకాలు కనిపిస్తే దాడి చేసే దూకుడు స్వభావమున్న దుప్పిలు.. దాడి చేయకుండా పలుజాగ్రత్తలు తీసుకోవాలని అమెరికాలోని వైల్డ్ లైప్ సంరక్షకులు సూచిస్తున్నారు. ఇక ఇవి కనిపించగానే అహారం పెట్టి.. చనువుగా దగ్గరకు తీసుకోవాలని భావించడం కూడా తప్పేనట. ఎందుకంటే ఇవి ఆహారం తిన్నంత సేపు.. సౌమ్యంగా ఉండి.. ఆ తరువాత ఆహారం పెట్టినవారిపైనే దాడికి పాల్పడతాయని చెబుతున్నారు వన్యప్రాణి సంరక్షకులు.

అయితే ఇవి ఎలా దాడి చేస్తాయన్న అనుమానాలు ఈ క్రింది వీడియోలో తేలిపోతుంది. అమెరికాలోని అలస్కా పట్టణంలోని ఫెయిర్ బ్యాంక్స్ ప్రాంతంలో మంచు పడుతున్న వేళ.. ఓ వ్యక్తి తనకు వచ్చిన ఈమెయిల్స్ చెక్ చేసుకోవడానికి తన పెంపుడు కుక్కతో పాటు బయటకు వచ్చాడు. ఇది గమనించిన దుప్పి.. మెల్లిగా ముందుకు కదులుతూ.. వేగంగా వ్యక్తిపైకి దూసుకువచ్చింది. అతను అసలేమి అనకుండానే అది ఇలా దూకుడును ప్రదర్శించింది. అయితే ఆయన పెంపుడు శునకం అరవడంతో ఆయన అలెర్టయ్యాడు. దాని నుంచి చివరిక్షణంలో తప్పించుకున్నాడు. తన పెంపుడు కుక్క వెంటపడినా అది చుట్టూ తిరిగి వ్యక్తి వెనకాలే పరిగెత్తింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : massive moose  staring man  moose charged man  moose charged dog  Fairbanks  Alaska  USA  Crime  

Other Articles