Man, daughter die after e-bike bursts in flames ఎలక్ట్రికల్ బైక్ పేలి.. తండ్రి కూతుళ్ల దుర్మరణం..

Father daughter die in vellore after electric bike explodes while charging

Allapuram, Electric Bike Blast, electric bike exploded, father and daughter, New electric bike exploded, fire, Electric Bike, vellore, Electric Bike Blast, Tamil Nadu, crime

A Man who was disguised as a Girl was caught by Bus conductor getting free bus ride in Delhi. Actually Women/Girls in Delhi get free rides in public buses as the Delhi government has sanctioned this facility for all Girls/Women who reside in Delhi.

ITEMVIDEOS: వేల్లూరులో తండ్రి కూతుళ్ల ప్రాణాలను బలి తీసుకున్న ఎలక్ట్రికల్ బైక్..

Posted: 03/26/2022 06:33 PM IST
Father daughter die in vellore after electric bike explodes while charging

ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్న తరుణంలో రెక్కాడితే కానీ డొక్కాడని మధ్యతరగతి ప్రజలు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా అందుబాటులోకి రావడంతో పాటు రాయితీలు కూడా కల్పిస్తుండటంతో ప్రజలు అకర్షితులవుతున్నారు. అయితే ఇలా తెచ్చుకున్న ఈవీ బైకులు.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని కుత్భుల్లాపూర్ పరిధిలో ఓ ఈవీ బైక్ పేలింది. దీంతో ఇంట్లోని సామాగ్రి అంతా కాలిబూడిదైంది.

అయితే ప్రాణనష్టం మాత్రం కాలేదు. కానీ తమిళనాడులో తాజాగా పేలిన ఎలక్ట్రిక్ వాహనం మాత్రం పెను విషాదాన్ని నింపింది. ఇంట్లో ఆదమరచి నిద్రపోతున్న తండ్రి కూతుళ్ల ప్రాణాలను హరించింది. రెండు రోజుల క్రితం ఎంతో ఉత్సాహంగా తెచ్చుకున్న ఎలక్ట్రికల్ బైక్ తండ్రి కూతుళ్ల ఇద్దరి ప్రాణాలను బలిగొందని స్థానికలు కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేలూరు జిల్లాలోని అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె మోహన ప్రీతి (13) పోలూరు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.

ఇదిలా ఉండగా దురై వర్మ రెండు రోజుల క్రితం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి తండ్రీకూతుళ్లు చార్జింగ్ పెట్టి నిద్రిస్తుండగా, ఓవర్ చార్జింగ్ కారణంగా వైరు తగిలి బైక్ పేలిపోయింది.. మరో బైక్‌కు మంటలు అంటుకున్నాయి. అయితే, పేలుడు ధాటికి భారీగా పొగలు కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే ఇరుక్కుపోయిన తండ్రీకూతుళ్లు బాత్‌రూమ్‌లో దాక్కున్నారు.. అదే వారి ప్రాణాలను తీసింది. బాత్‌రూమ్‌లోకి కూడా దట్టమైన పొగలు రావడంతో.. ఊపిరాడక తండ్రీకూతుళ్లు అక్కడే మృతిచెందారు.

ఇక, దురైవర్మ ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది.. మంటలార్పి లోపలికి వెళ్లిచూస్తే.. అప్పడికే తండ్రీకూతుళ్లు మృతి చెందారు. ఇక, బాత్‌రూమ్‌ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మరోవైపు.. కొత్తగా కొనుగోలు చేసిన బ్యాటరీ బైక్ పేలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles