RIMS refers Lalu to AIIMS కేంద్రం బాటలోనే తెలంగాణ: ఒక్కసారి టెట్ పాసైతే చాలు..

Ts tet 2022 live updates telangana tet registration begins march 26

telangana teacher eligibility test,tstet 2022,tstet,telangana tet,Telangana TET 2022,TS TET 2022,TS TET 2022 Application Form, TS TET 2022, Telangana State Teacher Eligibility Test, TS TET 2022, Department of School Education, Teacher Eligibility Test

Telangana has released the TSTET 2022 notification. The registration process will begin on March 26, 2022 and will end on April 12, 2022. The examination will be conducted on June 12, 2022. Candidates can apply for the examination on the official site of TSTET on tstet.cgg.gov.in. The validity period of TET qualifying certificates for appointment, unless otherwise notified by the Government of Telangana, would remain valid for life.

కేంద్రం బాటలోనే తెలంగాణ: ఒక్కసారి టెట్ పాసైతే చాలు.. గడువు లేదు..

Posted: 03/25/2022 04:12 PM IST
Ts tet 2022 live updates telangana tet registration begins march 26

కేంద్రంలోని సెంట్రల్ బోర్డు అప్ ఎడ్యూకేషన్ వెళ్లిన భాటలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా పయనిస్తోంది. సీటెల్ కు ఉన్న అర్హత ఏడేళ్ల నుంచి జీవితకాలానికి పరిమితం చేసిన కేంద్రం బాటలోనే తెలంగాణ కూడా పయనిస్తోంది. రాష్ట్రం కూడా దాదాపుగా కొన్నేళ్ల తరువాత నిర్వహిస్తున్న తెలంగాణ ఉపాధ్యయ అర్హత పరీక్షః(టెట్‌) కాలపరిమితి విషయంలో కీలక నిర్ణయానికి అమోదం తెలుపుతూ అదేశాలు జారీ చేసింది. టెట్ కు సంబంధించి ఇటీవల మంత్రుల కమిటీ చేసిన కొన్ని సవరణలను ప్రభుత్వం ఆమోదించింది.

గతంలో టెట్‌లో సాధించిన అర్హత కాలపరిమితి ఏడేళ్లుగా ఉండేది. దీన్ని ఇప్పుడు జీవితకాలానికి పొడిగించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్‌సీటీఈ) రెండేళ్ళ క్రితం ఈ మేరకు మార్పులు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా మార్పులు చేసింది. దీని ప్రకారం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అంటే అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్‌ పాసైనవారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ను జూన్‌ 12వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటి ఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్‌ రాధారెడ్డి సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఈ నెల 25వ తేదీన ‘టీఎస్‌టెట్‌. సీజీజీ.జీవోవీ.ఇన్‌’వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు.

కాగా టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. పేపర్‌–1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.00 వరకు, పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. అయితే 2010కి ముందు జిల్లా నియామక కమిటీ పరీక్షలలో ఉత్తర్ణులైన ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి టెట్ ను మినహాయింపు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles