Telangana Finance Department Approved 30453 Posts తెలంగాణలో 30453 పోస్టులకు అర్థికశాఖ పచ్చజెండా

Good news for unemployed youth in telangana finance department approved 30453 posts

Public service commission, group, district selectiion commission, police recriutment board, medical Health recritment board, government jobs, sarkari jobs, group-1, police jobs, prison department, transport, health dept,30453posts Approved, CM KCR, Finance Department, Telangana

Telangana Finance Ministry gives good news for Unemployed youth in Telangana, by approving 30453 government jobs in the first phase. The KCR government had annoinced to fill the total of 80 thousand jobs in the state

తెలంగాణలో తొలివిడతగా 30453 ఉద్యోగాల భర్తీకి అర్థికశాఖ పచ్చజెండా

Posted: 03/23/2022 09:05 PM IST
Good news for unemployed youth in telangana finance department approved 30453 posts

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. ఇటీవల శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సీఎం శాసన సభలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు దఫాలుగా చర్చించారు. మొత్తం 80,039 పోస్టులకు గాను.. తొలి విడుతగా 30,453 పోస్టుల భర్తీకి ఇవాళ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది.

గ్రూప్‌-1, హోంశాఖ, జైళ్లు, రవాణాశాఖలు, వైద్య, ఆరోగ్యశాల్లోని పోస్టులతో పాటు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు సైతం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సంబంధిత శాఖల్లో భర్తీ ప్రక్రియను నియాకమక సంస్థలు చేపట్టనున్నాయి. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి, మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేయనున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles