NCP MP Supriya Sule On Petro Hike in Lok Sabha ఇంధన గ్యాస్ ధరలపై పెంపుపై సుప్రియా సూలే ఎద్దేవా..

Polls every month best way to check rising fuel prices supriya sule in lok sabha

NCP MP Supriya Sule, Supriya Sule on raising fuel price, Supriya Sule on price raise in Loksabha, Supriya Sule on petrol price, Supriya Sule on diesel price, Supriya Sule on subsidised gas cylinder price, petrol price, Diesel price, LGP price, Fuel price, Polls every month, check rising fuel prices, Fuel price hike, Supriya Sule, Lok Sabha, Parliament, Budget Session, Adhir Ranjan Chowdhury

Elections every month are the best way to check rising prices of petrol, diesel and cooking gas, NCP member Supriya Sule said in Lok Sabha on Wednesday in a swipe at the Centre over the hike in fuel cost after the recent assembly polls. Raising the issue of hardships being faced by women due to the increase in the price of cooking gas, she said during the Zero Hour that the BJP won the assembly polls in four out of five states where people stood in queues to vote for it.

‘‘ఎప్పుడూ ఎన్నిక‌లుంటే.. పెట్రో ధ‌ర‌లు పెర‌గ‌వ్‌..’’ ఎన్సీపీ ఎంపీ ఎద్దేవా..

Posted: 03/23/2022 07:24 PM IST
Polls every month best way to check rising fuel prices supriya sule in lok sabha

దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెంపుతో పాటు సబ్సీడీ వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశప్రజల నుంచి తీవ్ర అందోళన వ్యక్తం అవుతోంది. పెంచిన ఇంధన ధరలు, గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలని ఓ వైపు పార్లమెంటు ఆవరణలోకి జాతిపిత బాపూజీ విగ్రహం వద్ద విపక్ష నేతలు అందోళన చేపట్టగా.. మరోవైపు పార్లమెంటులోనూ పెట్రో, సిలిండ‌ర్ ధ‌ర‌ల పెంపుపై విపక్షాలు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించాయి. ఈ క్రమంలో ఎన్సీపీ అగ్రనేత, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సూలే కూడా తనదైన శైలిలో కేంద్రంలోని ప్రభుత్వంపై వ్యంగోక్తులు విసిరారు.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లలో ప్రజలు పెరుగుతున్న ఇంధన దరలను మర్చిపోయేందుకు ప్రభుత్వం గత నాలుగు నెలలుగా ఒక్క రూపాయి కూడా పెంచలేదని.. అయితే ఫలితాలు వెలువడగానే రెండు రోజుల వ్యవధిలో ఏకంగా రూపాయిన్నరకు పైగా ఇంధన ధరలు పెరిగాయని విమర్శించారు. అంతేకాదు వంటింట్లోని సబ్సీడి గ్యాస్ సిలిండర్ ధరలను కూడా కేంద్రం ఏకంగా రూ.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై అమె మండిప‌డ్డారు. ఇక‌పై ప్ర‌తి నెలా ఎన్నిక‌లుండాల‌ని, దీంతో పెట్రో ధ‌ర‌ల పెంపు ఉండ‌ద‌ని ఎద్దేవా చేశారు. ‘ఎన్నిక‌లు ఉన్నందునే పెట్రో ధ‌ర‌లు పెంచ‌కుండా ఉన్నారు. ఇక‌పై ప్ర‌తి నెలా ఎన్నిక‌లుండాలి. అప్పుడు పెట్రో, డీజిల్‌, ఎల్పీజీ ధ‌ర‌లు పెర‌గ‌వు’ అంటూ సుప్రియా సూలే ఎద్దేవా చేశారు.

ఇదిలావుండగా, నెట్టింట్లో తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పాత ట్వీట్ కూడా వైరల్ గా మారింది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ హయాంలో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ అయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో సబ్సీడీ వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 50 మేర పెంచారు. ఈ నేపథ్యంలో అప్పటి విపక్ష పార్టీ నేతగా స్మృతి ఇరానీ ప్రజలు కష్టాల్లో ఉంటే సామాన్యుల ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ సామాన్యులకు గ్యాస్ సిలిండర్లను దూరం చేస్తోందంటూ అమె ట్వీట్ చేశారు. ఇక తాజాగా అదే ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. అమెను నెట్ జనులు సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటే ఇదేనా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపుదలను ప్రారంభించాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్‌ ధర రూ.96.36కు చేరింది. నిన్న పెట్రోలు రూ.109.10, డీజిల్‌ రూ.95.50గా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో పెట్రోల్‌ రూ.112.80, డీజిల్‌ రూ.98.10, విజయవాడలో పెట్రోల్‌ రూ.111.88, డీజిల్‌ రూ.97.90కి చేరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles