Lack of safety measures in godown: Hyderabad CP రక్షణ పరికరాలు లేక పోవడం వల్లే ప్రమాద తీవ్రత: సిపీ ఆనంద్

Safety measures violation lead to massive tragedy in bhoiguda godown hyderabad cp

Fire Accident, safety measures, safety measure violation, Hyderabad CP CV Anand, Scrap Godown, Timber Business, secundrabad fire accident, Hyderabad Police commissioner, CV Anand, massive fire accident, Hyderabad, Telangana, crime

Hyderabad City police commissioner CV Anand said that all the victims were from Chapra district of Bihar and they were working for a monthly salary of Rs 12,000 for two years."The victims were in their early and mid-twenties. At around 4am there seems to be a cylinder blast and we received a dial 100 call. Our night duty officers rushed to the spot along with fire department personnel.

రక్షణ పరికరాలు లేక పోవడం వల్లే ప్రమాద తీవ్రత: సిపీ ఆనంద్

Posted: 03/23/2022 03:52 PM IST
Safety measures violation lead to massive tragedy in bhoiguda godown hyderabad cp

బోయిగూడలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న శ్రవణ్ ట్రేడర్స్ స్క్రాప్ గోదాం నిబంధనలకు నీళ్లు వదలడం వల్లే ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు అరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదాం యజమాని సంపత్ గా అధికారులు గుర్తించిన అధికారులు.. అతన్ని అడుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను గురువారం స్వస్థలాలకు తరలించనున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కావడానికి ఈ రోజు సాయంత్రం అవుతుందని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం గుండా 3 పాట్నాకు చెందిన విమానాలలో మృతదేహాలను తరలించనున్నట్లు వెల్లడించారు. స్క్రాప్‌ గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్‌లో  మంటలు వ్యాపించాయని.  ఆ తర్వాత సిలిండర్ పేలుడు జరగడంతో దట్టమైన పొగ కమ్ముకుందని తెలిపారు. ప్రమాద సమయంలో  కార్మికులంతా నిద్రలో ఉన్నందున ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని పేర్కొన్నారు.  

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్‌ సిలిండర్‌ పేలినట్లు 100కు ఫోన్‌కాల్‌ వచ్చిందని చెప్పారు. గోదాం విస్తీర్ణం సుమారు వెయ్యి గజాలలో ఉన్నప్పటికీ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒక్కటే ప్రవేశం ఉండటం వల్లే లోపన ఉన్న కార్మికులు తప్పించుకునే మార్గంలేక బలైపోయారని అన్నారు. సిలిండర్‌ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నారు. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని చెప్పారు. గాయాలైన వ్యక్తితో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని తెలిపారు. గోదాం లోపలి భాగంలో పెద్ద ఎత్తున సీసాలు, ఇతర ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల కు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. మంటల దాటికి సీసాలు పగిలిపోయి చెల్లా చెదురుగా లేనికి వెళ్లలేని విధంగా పడిపోయాయి.
 
అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న షెడ్డుకు ఫైర్ విభాగం నుండి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. దీనికి తోడు లోపలి భాగంలో ఎలాంటి అగ్ని ప్రమాద రక్షణ చర్యలు లేవు. జీహెచ్ఎంసీ, కార్మిక విభాగాల నుండి కూడా ఎలాంటి అనుమతులు లేవని కమీషనర్ తెలిపారు. అలాగే గోడౌన్‌లో ఎలాంటి సేఫ్టీ పరికరాలు కూడా లేవని సీవీ ఆనంద్ వివరించారు. మృతులంతా  బిహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని, ఇక్కడ పనిచేసే కార్మికులకు నెలకు రూ. 12 వేలను జీతంగా ఇస్తారని తెలిపారు. అయితే గాంధీ నగర్ పోలీసులు గోదాం యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పరిశీలించారు.

అగ్ని ప్రమాద మృతులంతా బీహార్ రాష్ట్రంలోని జిల్లా ఛాప్రాకు చెందినవారు. సుమారు రెండేళ్లుగా వీరు ప్రమాదం జరిగిన గోదాంలో పని చేస్తున్నారు. వీరిలో కొంతమందికి వివాహం కాగా పెండ్లి కాని వారు కూడా ఉన్నారు. అయితే వీరందరిని గుర్తించాల్సి ఉంది. వీరంతా నెలకు రూ. 12 వేల జీతానికి పని చేస్తున్నారు. వీరిలో కొంతమంది మరో పది రోజులలో ఇంటికి వస్తామని కుటుంబ సభ్యులతో చెప్పగా ఇంతలో దారుణం జరిగిపోయింది. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. మృతులంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతులను సికిందర్‌(40), బిట్టు(23), సత్యేందర్‌(35), గోలు(28), దామోదర్‌(27), రాజేశ్‌(25), దినేశ్‌(35), రాజు(25), చింటు(27), దీపక్‌(26), పంకజ్‌(26)గా గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles