LPG Domestic Cylinder Price Increase By Rs 50 వంటింట్లో గుదిబండ: సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు

Lpg cylinder price increased by rs 50 for the 1st time since october 2021

commercial LPG cylinder, LPG cylinder, LPG cooking gas cylinder, Cooking gas, LPG cylinder Rates, LPG Gas price, lpg price, lpg price hike, lpg cylinder price hike, lpg price today, lpg cylinder price today, lpg commercial cylinder price, lpg price in up, lpg price in hyderabad, lpg price agra, lpg price darbhanga, lpg price haryana, lpg price west bengal, lpg price in kerala, lpg price in patna, lpg cylinder, LPG Price, LPG Domestic Cylinder, LPG Rate, Cooking Gas Price

The prices of domestic LPG cylinders have been increased by Rs 50 in Delhi, Mumbai, Pune and other cities from today. This is the first increase after 6 October 2021. In Hyderabad, the 14.2 kg LPG cylinder cost is Rs 952.5 while the 19 kg commercial cylinder is being sold for Rs 2004.5 now.

వంటింట్లో గుదిబండ: సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు

Posted: 03/22/2022 12:28 PM IST
Lpg cylinder price increased by rs 50 for the 1st time since october 2021

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత తప్పకుండా ఇంధన ధరలతో పాటు గ్యాస్ ధరలను కూడా పెంచుతారంటూ ఇప్పటికే నిపుణులతో పాటు ప్రతిపక్ష నేతలు చెప్పడంతో.. కొన్నిరోజుల పాటు గ్యాప్ ఇచ్చిన కేంద్రం.. మళ్లీ ఇంధనధరలతో పాటు వంట గ్యాస్ ధరను కూడా భారీగా పెంచింది. దేశంలో వంటగ్యాస్‌ ధరలు మరోసారి మంటెత్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయ వంట గ్యాస్ ధర మంగళవారం సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరిగింది. దీంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.949.50గా ఉంది.

అయితే ఇప్పటికే గత సంవత్సరం వంట గ్యాస్ సబ్సీడీ ధరలను భారీగా పెంచేసిన కేంద్రం.. మరోవైపు సబ్సీడిగా అందాల్సిన మొత్తాన్ని కూడా కేవలం నలబై రూపాయలను పైచిలుకు మాత్రమే అందిస్తోంది. గత సంవత్సరం అక్టోబర్‌ తర్వాత ఎల్పీజీ రేట్లను పెంచిప తనేవాత మళ్లీ ఇవాళ ఏకంగా రూ.50మేర పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్నప్పటికీ అక్టోబర్ ప్రారంభం నుంచి గ్యాస్‌ ధరలు పెంచలేదు. పెంచిన ధరలతో దేశరాజధాని ఢిల్లీలో గ్యాస్ ధర ఏకంగా రూ.949.50గా ఉండగా, ముంబైలోనూ 949.50గా నమోదైంది.

ఇక కొల్ కతాలో ఏకంగా రూ.976గా నమోదుకాగా, చెన్నైలో 965.5గా కొనసాగుతుండగా, ఇటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో లక్నో 987.5గా నమోదైంది. ఇటు పూణేలోనూ 14.2 కేజీల సబ్సీడీ ఎల్సీజీ సిలిండర్ ధర ఏకంగా 952.5గా నమోదైంది. ఇక 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349 కాగా, 10 కిలోల కాంపోజిట్ బాటిల్ రూ. 669గా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2003.50గా ఉంది. పెరిగిన గ్యాస్‌ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెంచిన ధరలతో తెలంగాణలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1000 దాటింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lpg  lpg cylinder  LPG Price  LPG Domestic Cylinder  LPG Rate  Cooking Gas Price  

Other Articles