Chinese airliner crashes in southern province of Guangxi చైనాలో ఘోర విమాన ప్రమాదం: 133 మంది ప్రయాణికులు..

Boeing 737 plane carrying 133 passengers crashes in china

China Plane Crash, China Plane Crash News, China Plane Crash Video, China Plane Crash Live, China Eastern Airlines, Guangxi news, China Eastern Airlines Plane Crash, China, Plane Crash, China Eastern Airline, Boeing 737, Crash, China, Plane crash, China Eastern Airline, Boeing 737, China Eastern Airlines, Boeing 737 Crash

A Chinese airliner with 132 passengers on board Monday crashed in the southern province of Guangxi, the Chinese media has reported. According to broadcaster CCTV, the accident involving a China Eastern Airlines Boeing 737 took place near the city of Wuzhou in Teng county.

ITEMVIDEOS: చైనాలో ఘోర విమాన ప్రమాదం: 133 మంది ప్రయాణికులు..

Posted: 03/21/2022 04:41 PM IST
Boeing 737 plane carrying 133 passengers crashes in china

చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 132 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం క్రాష్ అయింది. నైరుతి చైనాలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ఆ దేశ అధికారిక బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ సోమవారం రిపోర్ట్ చేసింది. బోయింగ్ 737 విమానం 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది క్రూ సిబ్బందితో ఆ విమానం బయల్దేరినట్టు చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ గువాంగ్జీ రీజియన్‌లో వుజో నగరం శివారుల్లో ఈ ఫ్లైట్ క్రాష్ అయినట్టు తెలిపింది. ఫ్లైట్ నేల కూలడంతో ఆ కొండప్రాంతంలో భారీ మంటలు చెలరేగాయి.

కాగా, ఇప్పటికే రెస్కూ టీమ్‌లు ఘటనా స్థలికి బయల్దేరి సహాయక చర్యల్లో మునిగింది. కానీ, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఫ్లైట్ క్రాష్ అయిన ప్రాంతం మొత్తం కార్చిచ్చులా మంటలు ఎగసిపడుతున్నాయి. అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో ఉన్న ఓ అగ్నిపమాక సిబ్బంది అధికారి స్థానిక మీడియా పీపుల్స్ డైలీతో మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశాలు కనిపించడం లేదని తెలిపారు. ఆ శిథిలాల్లో ఒక్కరూ ప్రాణాలతో ఉండే అవకాశాల్లేవని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పోస్టుల ప్రకారం, చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ ఎంయూ5735 కున్మింగ్ నుంచి గువాంగ్జూకు బయల్దేరింది. కానీ, అది గమ్యం చేరకముందే మిస్ అయింది. గ్రౌండ్ నుంచి దాని సంబంధాలు తెగిపోయినట్టు పోస్టులు వచ్చాయి. గ్రౌండ్ సిబ్బందితో సంబంధాలు తెగిపోయిన తర్వాత ఆ విమానం అదుపు తప్పి ఉండొచ్చని, కొండ ప్రాంతాల్లో అది ఢీకొట్టుకుని క్రాష్ అయి ఉంటుందనే అంచనాలూ వస్తున్నాయి. విమానం నిటారుగా నేలపై కూలిపడిపోయినట్టు కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. నేలకూలిన తర్వాత అక్కడ పెద్దగా మంటలు వ్యాపించినట్టు తెలుస్తున్నది.

చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ప్లేన్ 132 మందితో బయల్దేరిందని, అది వుజో దగ్గర టెంగ్ కౌంటీలో క్రాష్ అయిందని అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ వెల్లడించింది. క్రాష్ అయిన కొండ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని వివరించింది. ఫ్లైట్ ఎంయూ5735 షెడ్యూల్ టైమ్‌ కల్ల గువాంగ్జికి చేరలేదని, కున్మింగ్ నుంచి ఇది మధ్యాహ్నం 1.11 గంటలకు (0511 జీఎంటీ) బయల్దేరిందని విమానాశ్రయ సిబ్బంది వ్యాఖ్యలను స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. అది 3.05 గంటలకు (0705జీఎంటీ) కి ల్యాండ్ కావాల్సిందని తెలిపింది. కానీ, ఆ ఫ్లైట్ 2.22 గంటలకు (0622 జీఎంటీ) ట్రాకింగ్‌లో లేకుండా పోయింది. ఫ్లైట్ మిస్ అయినప్పుడు 3225 ఎత్తులో 376 నాట్‌ల వేగంతో ఉన్నట్టు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles