Prostitution racket busted in Goa: TV actor rescued వ్యభిచార ముఠా గుట్టురట్టు.. టీవీ నటి సహా ఇద్దరు మహిళలు..

Flesh trade racket busted in goa tv actress from mumbai among 3 women rescued

flesh trade, Flesh Trade in Goa, prostitution racket busted in goa, tv actor rescued, tv actress, prostitution racket busted, Hyderabad-based man arrested, Hafiz Syed Bilal, television actress, mumbai woman, Hyderabad woman, Goa Crime Branch, Goa news, goa police, Mumbai, panaji, Sex Racket, Sangolda village, panaji, Goa, Crime

A Hyderabad-based man was arrested and three women, including a television actress, were rescued by the Goa Crime Branch after it busted a prostitution racket at Sangolda village near Panaji, reported news agency PTI. A press release issued by the Crime Branch said two of the rescued women, including the TV actress, were from Virar near Mumbai, while the third one hailed from Hyderabad.

గోవాలో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. టీవీ నటి సహా ఇద్దరు మహిళలు..

Posted: 03/18/2022 09:29 PM IST
Flesh trade racket busted in goa tv actress from mumbai among 3 women rescued

అక్రమ మార్గాల ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలని అనుకునేవారు.. మంచి చెడులు అలోచించరు. మన, పర భేదం కూడా వీరి అలోచనకు రాదు. తామున్న ప్రాంతంలో పట్టుబడితే ఎక్కడ తమ పేరు చెడిపోతుందోనని భావించిన ఓ హైదరాబాద్ నగరవాసి.. ఏకంగా గోవాకు వెళ్లి అక్కడి ఓ గ్రామంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అయితే వక్రమార్గంలో అర్జనకు అలవాటు పడితే ఏదో ఒక రోజు తప్పక కటకటాలు లెక్కబెట్టాల్సిందే. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. గోవాలో హైదరాబాద్ వాసి నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు గోవా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు.

అంతేకాదు ఈ వార్త అక్కడ గోవాతో పాటుగా ఏకంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమైంది. దీంతో హైదరాబాద్ వాసి ఎవరికీ తెలియకుండా చేస్తున్న బాగోతం కూడా అందరికీ తెలిసిపోయింది. ఇక, పోలీసుల దాడుల్లో ఓ టీవీ నటి సహా మరో ఇద్దరు మహిళల ముఠా సభ్యుడితో పాటు పట్టుబడగా, వారిని పోలీసులు కాపాడారు. వీరిలో టీవీ నటితో పాటు మరో మహిళ ముంబై ప్రాంతానికి చెందినవారు కాగా, మరోకరు హైదరాబాద్‌కు చెందిన మహిళ కావడం గమనార్హం. క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. పక్కా సమాచారంలో ఓ హోటల్‌పై పోలీసులు రైడ్స్‌ చేశారు. ఈ దాడుల్లో టీవీ నటితో సహా మరో ఇద్దరు మహిళలను పోలీసులు కాపాడారు. కాగా టీవీ నటి, మరో మహిళ ముంబై సమీపంలోని విరార్‌కు చెందిన వారు కాగా.. మూడో మహిళను హైదరాబాద్‌కు చెందినట్టు నిర్ధారించారు. అరెస్ట్‌ చేసిన అనంతరం విచారణలో భాగంగా హఫీజ్ సయ్యద్ బిలాల్.. సదరు మహిళలకు బలవంతంగా వ్యభిచారకూపంలోకి దింపినట్టు తెలిపారు.

కాగా , వీరికి రూ. 50వేలు చెల్లించడానికి కస్టమర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అయితే, నిందితుడు వారిని గురువారం అక్కడికి తీసుకువచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే నిందితుడు కేవలం 26 ఏళ్ల వ్యక్తి కావడం గమనార్హం. ఇక పట్టుబడిన మహిళలందరూ 30 నుంచి 37 ఏళ్ల మధ్య వయస్సువారై ఉండటం గమనార్హం. దీంతో పట్టుబడిన యువకుడు హఫీజ్ సయ్యద్ బిలాల్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 370(3), 370(ఎ)(2), సెక్షన్ 4, 5, 7 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flesh trade  Flesh Trade in Goa  Goa Crime Branch  Goa news  goa police  Mumbai  panaji  Sex Racket  panaji  Goa  Crime  

Other Articles