Excited Reaction of a Happy Groom on Seeing His Bride వధువును చూసి సంభ్రమాశ్చర్యంలో వ‌రుడు

Netizens amused excited reaction of a happy groom on seeing his bride

bride groom pretends to faint, bridegroom pretends to fall, bridegroom delighted reaction seing bride, groom excited reaction, happy groom, groom on seeing his bride, bridal hall, faint and fall, groom, groom's delighted reaction, Happy Groom, Instagram, memorable moments, viral video, video viral

The groom and his friends are seen waiting for the bride on the wedding stage. As soon as the bride enters the bridal hall, the eager groom becomes excited and pretends to faint and fall. The groom then greets the bride with a loving hand and welcomes her to the stage.

ITEMVIDEOS: వైర‌ల్ వీడియో: పెళ్లిమండ‌పంలో వధువును చూసి సంభ్రమాశ్చర్యంలో వ‌రుడు

Posted: 03/15/2022 08:32 PM IST
Netizens amused excited reaction of a happy groom on seeing his bride

పెళ్లి అనేది ఎవ‌రి జీవితంలో అయినా ఓ మ‌ధుర జ్ఞాప‌కం. జీవితంలో ఒక పర్యాయం మాత్రమే జరిగే ఈ కమనీయ ఘటనను.. నిండు నూరేళ్లు పాటు జ్ఞాపకాలను అస్వాదించేలా చేస్తోంది. అందుకనే ఏ జంట అయినా తమ పెళ్లిలో మధురానుభూతిని పోందాలని.. మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఫోటోలు, వీడియోలతో మాత్రమే ఈ జ్ఞాపకాలను మిగుల్చుకునేవారు. కానీ ఇప్పడు తరం మారింది. సోషల్ మీడియా ప్రభావం ఇందు కలదు అందు లేదు అన్న సందేహమే లేదు అన్నట్లుగా నేటి తరం యువతీ యువకులపై దీని ప్రభావం చాలా ఉంది.

దీంతో ఈ ప్రభావం వివాహా వేదికల వరకు చేరకుంది. దీనికి తోడు జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్లి వేడుకను కూడా ఎంతో స్పెష‌ల్‌గా, విభిన్నంగా జరుపుకోవాల‌ని అంద‌రూ ఆరాట‌ప‌డుతుంటారు. దాని వ‌ల్ల పెళ్లి మండ‌పంలో ఎన్నో ఫ‌న్నీ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అటువంటిదే ఒక‌టి ఓ పెళ్లి మండ‌పంలో చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి పెళ్లి వేదిక మీద పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంత‌లో పెళ్లి కూతురును తీసుకొస్తూ ఉంటారు. స‌డెన్‌గా పెళ్లి కూతురును చూడ‌గానే వ‌రుడు ఫిదా అయిపోతాడు.

త‌న ఫ్రెండ్స్ మీద ప‌డిపోతాడు. ఆ త‌ర్వాత పెళ్లి కూత‌రు చేయి అందుకొని త‌న‌ను స్టేజ్ మీదికి తీసుకొస్తాడు. అయితే.. ఈ వీడియోను ఎక్క‌డ తీశారు.. ఎప్పుడు తీశారు అనే విష‌యం తెలియ‌న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. నీకు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది.. అంటూ ఆ వీడియోకు క్యాప్ష‌న్ కూడా పెట్టారు. నెటిజ‌న్లు కూడా ఈ వీడియోను చూసి వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by WedAbout.com (@wedabout)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles