ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తీరు కనిపిస్తోంది. గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రజల ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చినట్టుగానే బీజేపి తిరిగి తన సత్తాను చాటుకుంటోంది. 403 స్థానాలకు గాను.. ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ను పరిశీలిస్తే బీజేపీ 250 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
మెజారిటీ మార్క్ కేవలం 202 మాత్రమే అయినా తమ ఆ సంఖ్యను మించిన స్థాయిలో తమ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ లో మరోమారు కాషాయ పార్టీ జెండా రెపరెపలాడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా సమాజ్ వాదీ పార్టీ 118 చోట్ల, బీఎస్పీ 8 స్థానాల్లో, కాంగ్రెస్ 5 చోట్ల ముందంజలో ఉన్నాయి. ఖర్‌హల్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్ లీడింగ్‌లో ఉన్నారు. గోరఖ్‌పూర్ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జశ్వంత్ నగర్ నుంచి శివపాల్ యాదవ్, డిప్యూటీ సీఎం కేశ్ ప్రసాద్ మౌర్యలు కూడా లీడింగ్‌లో ఉన్నారు. గడిచిన 30 ఏళ్లలో యూపీలో వరుసగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఇది రెండవ సారి అవుతుంది. ఇదో కొత్త రికార్డు కానున్నది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more