Drone Shot Down Along India-Pakistan Border సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేసిన భారత బలగాలు

Drone shot down along india pakistan border in punjab

Pakistani Drone, India-Pakistan, Pakistani drone shot down, India-Pakistan border, BSF, Border Security Force, International Border (IB), para bombs, flying object shot down, BSF Troops, BSF spokesperson, Ferozpur sector, Punjab, Crime

The Border Security Force (BSF) troops on Monday shot down a Pakistani drone along the International Border (IB) in Punjab's Ferozpur sector. The BSF personnel heard a humming sound at around 3 am of a flying object coming from the Pakistan side of the border to the Indian side. They then illuminated the area with "para bombs" and fired at the drone, a BSF spokesperson said.

సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేసిన భారత బలగాలు

Posted: 03/07/2022 12:56 PM IST
Drone shot down along india pakistan border in punjab

పాకిస్థాన్ ఉగ్రచర్యలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ఓ వైపు దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులను చొరబడేందుకు నిత్యం ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. మరోవైపు దేశంలోని కీలకమైన ప్రాంతాలపైకి డ్రాన్ లను పంపుతూ దాడులు చేస్తోంది. శనివారం రోజున జమ్మూ-కాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో ఒక డ్రోన్ ను భారత భద్రతా బలగాలు పేల్చివేసిన తరువాత కూడా కుక్క తోక వంకర అన్న చందంగా తన వక్రబుద్దిని మార్చుకోని పాకిస్థాన్ ఇవాళ వేకువజామున మరో డ్రోన్ ను దేశంలోకి చోచ్చుకెళ్లేలా ప్రయోగించింది. కాగా భారత సరిహద్దు దళాలు అ డ్రోన్ ను పేల్చివేశాయి.

తాజాగా ఇవాళ వేకువ జామున పంజాబ్​ ఫిరోజ్​పుర్​ సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దులో భార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు (బీఎస్​ఎఫ్) పాకిస్థాన్​ డ్రోన్​ను కూల్చివేశాయి. వేకువ జామున సుమారు 3.00 సమయంలో పాకిస్థాన్ వైపు నుంచి దేశంలోకి చోచ్చుకోస్తున్న డ్రోన్ ను గాలి తెన్నెరలను చీల్చుకుంటూ వస్తుండడంతో ఆ శబ్దానికి అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు.. దానిని గుర్తించేందుకు గాలిలో పారా బాంబులను పేల్చారు. దీంతో ఆ ప్రాంతమంతా వెలుగులతో ప్రకాశవంతంగా మారింది. దీంతో డ్రోన్ ను టార్గట్ చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు దానిని కూల్చివేశారు.

కాగా ఈ డ్రోన్ ను ఆ వెలుగులలో గమనించినప్పుడు.. దానికి ఓ ఆకుపచ్చ వర్ణంలోని బ్యాగు తగిలించివుందని తెలిపారు. అందులో 4కేజీల నిషేధిత వస్తువులు ఉన్నట్లు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆకుపచ్చ సంచి ఉందని, అందులో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు, ఓ నలుపు వర్ణంతో కూడిన చిన్న ప్యాకెట్​ కూడా వుందని వెల్లడించారు. ఈ ఫ్యాకెట్ల మొత్తం బరుపు 4 కేజీల 17 గ్రాములు ఉందని అన్నారు. నల్లని ప్యాకెట్లో చుట్టిన ప్యాకెట్ బరువు మాత్రం 250గ్రాములుగా వుందని తెలిపారు. జమ్మూలోని సరిహద్దులో పాకిస్తన్ డ్రోన్ కూల్చిన 24 గంటలు కూడా గడవకముందే ఈ ఘటన జరగడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles