Third Class Student Complaint To Police Against His Teacher మాస్టారుపై పోలీసులకు 3వ తరగతి విద్యార్ధి పిర్యాదు

Third class student complaint to police against his teacher in bayyaram of telangana

3rd class student complaint to police on his teacher in bayyaram, 3rd class student complaint, bayyaram police station, student complaint on teacher for beating, 3rd class student, Police complaint, class teacher, bayyaram, bayyaram police station, mahabubabad district, Telangana, crime

Third Class Student Anil hailing from Bayyaram Mandal of Mahabubabad district in Telangana straght away goes to police station without any fear, to complaint to Police Against His Teacher, who is beating him without any reason.

అకారణంగా కొడుతున్నాడంటూ మాస్టారుపై పోలీసులకు 3వ తరగతి విద్యార్ధి పిర్యాదు

Posted: 03/05/2022 07:39 PM IST
Third class student complaint to police against his teacher in bayyaram of telangana

ఎవరికైనా అన్యాయం జరిగితే.. బెదిరింపులు వస్తే.. ప్రాణభయం ఏర్పడినా.. అన్యాయానికి గురైనా ఠక్కున పోలీసు స్టేషన్ కు వెళ్లి అవతలివారిపై పిర్యాదు చేస్తాం. కేసును దర్యాప్తు చేసిన తరువాత తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా ప్రజలకు పోలీసులపై ఉంది. అయితే కొందరు గతంలో పోలీసులపై ఉన్న అభిప్రాయాలతోనో.. లేక అక్కడికి వెళ్లితే.. తామే పలుమార్లు తిరిగాల్సి వస్తుందన్న అభద్రతా భావంతోనో కొందరు పోలిసు స్టేషన్ కు వెళ్లేందుకు సుముఖత చూపరు. కానీ.. ఈ మధ్య కొందరు చిన్నారులు ఎలాంటి జంకు లేకుండా ఠాణాలకు వెళ్తున్నారు.

భయం పక్కనపారేసి.. తమకొచ్చిన బాధలు చెప్పుకుని న్యాయం చేయాలని ధైర్యంగా పోలీసులను అడుగుతున్నారు. ఇదివరకే ఇద్దరు చిన్నారి స్నేహితుల మధ్య గొడవ తలెత్తడంతో ఒక చిన్నారి నేరుగా ఠాణాకు వెళ్లి అతడి స్నేహితుడిపై పిర్యాదు చేసిన ఘటనను మర్చిపోకముందే.. ఇలాంటి ఘటనే మరోకటి మహబూబాబాద్​ జిల్లా బయ్యారంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న అనిల్​కు ఓ బాధొచ్చింది. తనను ఓ ఉపాధ్యాయుడు తరచూ కొడుతున్నాడు.

అయితే.. ఎలాంటి తప్పు లేకుండానే ఆ ఉపాధ్యాయుడు తనను కొడుతుండటాన్ని ఆ చిన్నారి తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులకు చెప్పినా.. ఫలితం కనిపించలేదు. తనకు పోలీసులైతేనే న్యాయం చేస్తారని ఆ చిన్నారి నిర్ధరించుకున్నాడు. వెంటనే తన తండ్రిని పట్టుకుని పోలీస్​ స్టేషన్​కు వెళ్లాడు. నేరుగా ఎస్సై రమాదేవి దగ్గరికి వెళ్లి తన బాధ మొత్తం వెల్లగక్కాడు. తనను కొట్టే సారును అరెస్ట్​ చేయాలని పట్టుబట్టాడు. పిల్లాడు చెప్పే ముచ్చట మొత్తం విన్న ఎస్సై.. కానిస్టేబుల్​ను పురమాయించారు. పాఠశాలకు వెళ్లి ఆ సారు ఎవరు..? అసలు సంగతేంటో కనుక్కొమ్మని పంపించారు.

స్కూల్​కు వెళ్లిన కానిస్టేబుల్.. పాఠశాల మాస్టార్లను పిలిపించగా.. వారిముందే ఎలాంటి భయం లేకుండా.. "ఈ సారే నన్ను కొట్టింది. ఆ సారును అరెస్ట్​ చేయండి.." అని చెప్పాడు. ఈ ఒక్కసారికి వదిలేద్దాం.. మళ్లీ ఎప్పుడూ కొట్టకుండా చెప్తామని ఎంత బుజ్జగించినా.. తగ్గేదేలే.. కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. అనిల్​ ముందే సార్లకు కానిస్టేబుల్​ గట్టిగా చెప్పి.. ఇటు ఆ చిన్నారికి కూడా నచ్చజెప్పటంతో.. పంచాయితీ తెగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఆ చిన్నారి ధైర్యానికి మెచ్చుకుంటూనే.. ఇంత చిన్నవయసులో ఇంత తెగింపేంటని ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles