Lucky’s Biryani House fined Rs 55,000 for extra charge లక్కీ రెస్టారెంట్ కు రూ. 55 వేల జరిమానా.!

Lucky s biryani house fined rs 55 000 for charging rs 5 50 extra for water bottle

Chilukuri Vamshi, Osmania University student, Lucky’s Biryani House, Extra charge, Water bottle, Tilak Nagar, Consumer court, OU Student, Tilak nagar, Lucky Restaurant, Hyderabad, Telangana, Crime

The District Consumer Disputes Redressal Commission here penalised Lucky’s Biryani House at Tilak Nagar Rs 55,000 for charging a customer Rs 5.50 extra for a packaged water bottle. The Commission also directed the restaurant management to refund Rs 5.50 with a 10 percent interest rate.

అదనపు వసూళ్లకు పాల్పడిన లక్కీ రెస్టారెంట్ కు రూ. 55 వేల జరిమానా.!

Posted: 03/04/2022 04:43 PM IST
Lucky s biryani house fined rs 55 000 for charging rs 5 50 extra for water bottle

పది మందిలో పరువు పోగొట్టుకోవడం ఎందుకు..? అయినా ఎదుటివారి నోట్లో నోరు పెట్టేముందే ఓ సారి అలోచించుకోవాలి, ఐదు పది రూపాయల వద్ద రగడ ఎందుకు.? ఆ మాత్రం చెల్లించేలేకపోతే.. హోటళ్లకు రాకూడదు.. హోటల్ సిబ్బందికి దురుసు ప్రవర్తన కొత్త కాదు.. మనకెందుకోచ్చిన తలనోప్పి.. ఇలాంటి కోటేషన్లు అనేకం చెప్పేస్తుంటారు మనవారు. ఎప్పుడైనా, ఎక్కడైనా దీనికి ఇది ఎమ్మార్పీ కదా.. ఎక్స్ ట్రా ఎందుకు తీసుకుంటున్నారు.? అని ప్రశ్నిస్తే చాలు.. ఎదుటి వారి కన్నా ముందు మనవారే మన పరుపు, ప్రతిష్ట అంటూ దోపిడిని అడ్డుకునే ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంటారు.

అయితే స్నేహితులు, బంధువులు, ఇలా ఎవరైనా, ఎంతమంది సహకరించినా.. చివరకు ఎదుటివారిని దోపిడిపై ప్రశ్నిస్తే వారు కించపర్చేలా మాట్లాడుతారు. ఇలాంటి అవమానాన్ని తట్టుకుని వారిపై పోరాటం చేసిన యువకుడు ఇవాళ వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఈ విధంగానే వాటర్ బాటిల్ పై రూ.5 అధికంగా తీసుకున్నందుకు రెస్టారెంట్‌ వారితో ఎదురించి కన్స్యూమర్ కోర్టుకు వెళ్లి రూ.55వేల ఫైన్ విధించే వరకూ పోరాడు. అంతేకాదు.. పోరాడితే పోయేదేమీ లేదు.. అన్నట్లు అతడికి తాను అధికంగా చెల్లించిన ఐదు రూపాయలకు బదులు ఏకంగా 5 వేల రూపాయలు వచ్చిపడ్డాయి.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ని ఉస్మానియా యూనివర్సిటీ గౌతమి హాస్టల్లో ఉంటున్న వంశీ.. ఫ్రెండ్స్‌తో కలిసి తిలక్ నగర్‌లోని లక్కీ బిర్యాని సెంటర్‌కు వెళ్లాడు. బిర్యానితో పాటు ఓ వాటర్ బాటిల్‌ను ఆర్డర్ చేసిన వంశీ.. వాటర్ బాటిల్‌పై అధనంగా రూ.5.50 వసూలు చేయడంపై రెస్టారెంట్ వారిని ప్రశ్నించారు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది వంశీపై దురుసుగా ప్రవర్తిస్తూ పరుష పదజాలం వాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వంశీ.. వెంటనే హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్‌-2 బెంచ్‌ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు శుక్రవారం తీర్పు వెలువరించారు.

ఈ సందర్భంగా వంశీపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అదనంగా డబ్బులు వసూలు చేశారని గుర్తించిన న్యాయస్థానం.. బిల్లుపై అదనంగా వసూలు చేసిన రూ.5.50కి 10శాతం వడ్డీతో పాటు రూ.5వేలు పరిహారం చెల్లించాలని రెస్టారెంట్ యాజమాన్యానికి ఆదేశించింది. అంతేకాకుండా, జిల్లా వినియోగదారుల సంరక్షణ మండళ్ల సంక్షేమం కోసం రూ.50వేలు చెల్లించాలని వెల్లడించింది. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చెల్లించాలని ధర్మాసనం సూచించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాలని మందలిస్తూ.. జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles