Hyderabadis experiencing high temperatures in March తెలంగాణలో ఠారెత్తించనున్న భానుడు.. 48 డిగ్రీలు ధాటినున్న ఉష్ణోగ్రతలు

Hyderabadis to experience high temperatures in the begining of summer

Hyderabadis are experiancing the more than common temperature this summer. The Indian Meteorological Department (IMD) has said the heat recorded in Grrater Hyderabad municipality yesterday was nearly 35.4 degrees celsius. India Meteorological Department, heat wave, weather-report, warning, summer, heatwave in Hyderabad, hear in telangana, Telangana

Hyderabadis are experiancing the more than common temperature this summer. The Indian Meteorological Department (IMD) has said the heat recorded in Grrater Hyderabad municipality yesterday was nearly 35.4 degrees celsius.

తెలంగాణలో ఠారెత్తించనున్న భానుడు.. 48 డిగ్రీలు ధాటినున్న ఉష్ణోగ్రతలు

Posted: 03/03/2022 06:43 PM IST
Hyderabadis to experience high temperatures in the begining of summer

ప్రచండ భానుడి ఉగ్రరూపానికి నగరవాసులు అప్పుడే బెంబేలెత్తిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు చలేస్తోందని వణికిన నగరవాసి.. మార్చి నెల తొలివారంతోనే నగరంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో హైరానా పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే నగరవాసులు జంకుతున్నారు. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న క్రమంలో ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో ఏ యేటికాయేడు పెరుగుతూ పోతున్నాయి. దీంతో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతల తీవ్రతతో భానుడు ప్రస్తుతం ఉగ్రరూపం దాలుస్తూ నగరవాసులపై ఉరుముతున్నాడు.

గత ఏడాది నగరంలో మార్చి మాసాంతంలోనే ఏకంగా 40 డిగ్రీలకు పైగా గరిష్ణ ఉష్ణోగ్రతలు రికార్డు కాగా, ఈ ఏడాది మార్చి ఆరంభంలోనే ఏకంగా 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో ఇక రానురాను పరిస్థితులు ఎంత తీవ్రంగా వుండబోతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మే నెలలో భానుడు ఠాయేత్తిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. హైదరాబాద్ మాత్రమే కాకుండా ఏకంగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం ఈ సీజన్ లోనే అత్యధికంగా ఉండబోతుందన్న దానికి సంకేతాలు ఇప్పుడే అందుతున్నాయి. దక్షిణాది భాగం మినహా దాదాపు దేశమంతా కనీసంగా రెండు డిగ్రీల మీర పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

హైదరాబాద్ లోనూ క్రితంరోజున భానుడు భగభగలు సాధారణస్థాయికి మించి వున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 35.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది వేసవి తీవ్రత ఎలా వుంటుందన్న అంచనాలపై రూపోందించే నివేదిక యాన్యువల్ సమ్మర్ పోర్ కాస్ట్ లో భారత వాతావరణ కేంద్రం విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే సాధారణం లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రుతుపవనాలు కూడా సకాలంలోనే ఉంటాయని పేర్కొన్నది. కానీ మధ్య భారతం నుంచి పశ్చిమ, ఉత్తరం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగానే నమోదవుతాయని అంచనా వేసింది. కాగా ఈ జాబితాలో తెలంగాణ కూడా ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.  

ఆంధ్రప్రదేశ్ నుంచి దిగువ భాగంలో మాత్రమే పెద్దగా ఎండలు ఉండవని స్పష్టం చేసింది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణంకంటే ఎక్కువే నమోదవుతాయని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహోపాత్రో స్పష్టం చేశారు. సాధారణంకంటే కనీసంగా రెండు డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం సమ్మర్‌లో నమోదు కానున్నట్లు వివరించారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 6.5 డిగ్రీల మేర పెరిగినట్లయితే వడగాలుల తీవ్రత పెరగొచ్చని పేర్కొన్నారు. కానీ పసిఫిక్, హిందూ మహాసముద్రాల ఉపరితలాలపై లానినో ప్రభావం ఉన్నదని గుర్తుచేశారు.

హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న మాట్లాడుతూ, తెలంగాణలో ఈసారి సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే పెరుగుతాయని, మార్చి నెల మొదటి రోజుల్లోనే రెండు డిగ్రీల పెరుగుదల కనిపిస్తున్నదని వివరించారు. ఈ నెల ప్రారంభంలోనే 35 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత రాష్ట్రంలో నమోదైందని, ఇది సాధారణంకంటే రెండు డిగ్రీలు ఎక్కువని వివరించారు. మే నెలలో తారస్థాయికి చేరే సమ్మర్ సీజన్‌లో గరిష్ఠంగా 48 డిగ్రీల వరకు చేరుకోవచ్చని ఆమె అంచనా వేశారు. దానికి తగినట్లుగానే వడగాలులు కూడా వీస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్చి నెల చివరి నాటికి దాదాపు 40 డిగ్రీలు దాటొచ్చని, ఏప్రిల్‌లో 45 డిగ్రీలు మెయింటెయిన్ కావచ్చని, మే నెలలో మాత్రం 48 డిగ్రీల వరకు చేరుకుంటుందని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles