Can we ask Putin to stop the war, asks Chief Justice as PIL filed రష్యా-ఉక్రెయిన్ వారిపై సీజేఐ ఎన్వీ రమణ అసక్తికర వ్యాఖ్యలు

Can we direct putin to stop war sc on plea seeking evacuation of indians from ukraine

Can we ask Putin to the war, Supreme Court on Russia Ukraine, Russia Ukraine war, Indians stranded in Ukraine, Operation Ganga, CJI NV Ramana on Russia Ukraine, russia ukraine, russia ukraine news, russia ukraine latest news, indian students in ukraine, supreme court,india news

Chief Justice of India NV Ramana said the Apex Court can't do anything regarding the ongoing conflict between Russia and Ukraine as a PIL was filed before the Supreme Court on the evacuation of Indian students from the war-hit Ukraine. "What will the court do? Can I give directions to the President of Russia to stop the war?" the CJI said as the PIL was mentioned before him on Thursday morning.

యుద్దం వద్దని పుతిన్ కు అదేశాలివ్వనా.? రష్యా-ఉక్రెయిన్ వారిపై సీజేఐ ఎన్వీ రమణ అసక్తికర వ్యాఖ్యలు

Posted: 03/03/2022 04:09 PM IST
Can we direct putin to stop war sc on plea seeking evacuation of indians from ukraine

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయ విద్యార్థుల‌ను ర‌క్షించ‌డంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలైన పిటీష‌న్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టీస్‌ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ, ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థులను స్వ‌దేశానికి తీసుకురావడానికి సుప్రీంకోర్టు సీజే ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించే కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌ల‌ను ప్రస్తావించారు. అయితే, ఆ పోస్ట్‌ల‌ను చూసి తాను ఆశ్చర్యపోయిన‌ట్లు జ‌స్టీస్ ఎన్వీ ర‌మ‌ణ పేర్కొన్నారు.

యుద్ధాన్ని ఆపమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కోరండంటూ ఆ పోస్టులో అభ్య‌ర్థించార‌నీ, “యుద్ధాన్ని ఆపమ‌ని నేను రష్యా అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వగలనా..?” అని చీఫ్ జస్టీస్‌ ఎన్వీ ర‌మ‌ణ‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను రక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల పట్ల మాకు అన్ని ర‌కాలుగా సానుభూతి ఉందని, భారత ప్రభుత్వం దానికి సంబంధించి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, ప్ర‌భుత్వం ఇంకా ఏమి చేయగలదో మేము అటార్నీ జనరల్‌ను అడుగుతాము అని ఈ సంద‌ర్భంగా జ‌స్టీస్ ర‌మ‌ణ అన్నారు.

దీనిపై అత్యున్న‌త న్యాయ‌స్థానం చేయ‌గ‌లిగింది ఏమైనా ఉంటే త‌ప్ప‌నిస‌రిగా జోక్యం చేసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ఇక‌, ఉక్రెయిన్‌లో దాదాపు 8,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు ఇంకా చిక్కుకుపోయారని భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా ఇటీవ‌ల‌ తెలియ‌జేశారు. రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్ గగనతలం ఫిబ్రవరి 24 నుండి మూసివేయ‌డంతో ఉక్రెయిన్ పశ్చిమ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలాండ్‌ల నుండి భారతదేశం ప్రత్యేక విమానాల ద్వారా భార‌తీయ‌ పౌరులను స్వ‌దేశానికి త‌ర‌లిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles