IIT-K researchers predict covid 4th wave to hit India భారత్ లో కరోనా నాలుగో దశ ఎప్పుడంటే..

Covid 4th wave can be severe if iit kanpur team designs model on next coronavirus peak

covid, covid-19, covid fourth wave, coivd-19 fourth wave India, covid fourth wave India, covid India, COVID, 4th COVID wave, coronavirus, COVID wave, COVID wave in India, IIT Kanpur, Covid fourth wave in India, India coronavirus, corona wave

The severity of infection during the 4th COVID wave, which is likely to hit India in another 4 months, will depend on the coronavirus variant that emerges next and the vaccination status, including boosters, across the country. A team of scientists at IIT Kanpur, who designed a COVID model predicting the next wave, said that it will hit the country around June and will continue for the next 4 months, while peaking in August.

భారత్ లో కరోనా నాలుగో దశ ఎప్పుడంటే.. ఐఐటీ కాన్పూర్ అంచనా..

Posted: 02/28/2022 08:10 PM IST
Covid 4th wave can be severe if iit kanpur team designs model on next coronavirus peak

భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కరోనా ఆంక్షలు కూడా ఎత్తివేశారు. ప్రజలు కూడా కరోనా మార్గదర్శకాలను కూడా పక్కనబెట్టి మరీ సంచరిస్తున్నారు. అయితే కరోనా దశకు దశకు మధ్య ఇలా ప్రజలు తిరగడం పరిపాటిగా మారింది. దీంతోనే రెండో దశలో దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా చుట్టుముట్టి అనేక మందిని పోట్టనబెట్టుకుంది. కాగా ఆ తరువాత వచ్చిన మూడవ దశ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు అంత తీవ్రంగా లేకపోవడంతో దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ తరువాత వచ్చే కరోనా నాల్గవ దశ అయితే అత్యంత తీవ్రమైనది అయ్యివుండాలి లేదా.. నామమాత్రపు లక్షణాలతో కూడినదై వుంటుందని ఇప్పటికే వైద్యనిపుణులు అంచనా వేసిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని పక్కనబెడితే అసలు దేశంలో కరోనా వైరస్ నాలుగో దశ ఎప్పుడన్న విషయాన్ని ఐఐటీ కాన్పూర్ అంచనా వేసింది. కాన్పూర్ ఐఐటీ చేసిన పరిశోధనలో కరోనా వైరస్ కు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన దేశంలో కరోనా నాలుగో వేవ్ త్వరలోనే రాబోతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. రాబోయే జూన్ 22 పరిసర ప్రాంతంలో భారత్‌లో కరోనా నాలుగో వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఆగస్టు చివరి నాటికి ఇది పీక్ స్థాయికి చేరుతుందని ఈ స్టడీ వెల్లడించింది. అయితే ఏదైనా కొత్త కరోనా వేరియంట్ బయటపడితే ఈ అంచనాలు మారే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

కొత్తగా వచ్చే వేరియంట్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది? ఎంత ప్రమాదకరం? అనే అంశాలు ఈ పరిశోధనను ప్రభావితం చేస్తాయని వారు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తర్వాత జనవరిలో కరోనా తీవ్రత పెరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతిరోజూ దేశంలో లక్షపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పరిస్థితి నెమ్మదిగా తగ్గుముఖం పట్టుంది. ఇప్పుడు 20 రోజుల నుంచి లక్షలోపు కేసులే నమోదవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య 20 వేల లోపే ఉంటోంది. అయితే అప్పుడే కరోనా పూర్తిగా అంతం కాలేదని, జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles