Gurmeet Ram Rahim brought back to Sunaria jail డేరా బాబా పేరోల్ ముగిసింది.. మళ్లీ జైలుకు పయనం..

Dera sacha sauda chief gurmeet ram rahim brought back to sunaria jail

Gurmeet Ram Rahim, sunaria jail, rohtak, dera baba, Ram Rahim, Dera Sacha Sauda, Gurmeet Ram Rahim Singh, Rohtak jail, Haryana, Crime

Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh was on Monday brought back to Rohtak's Sunaria jail after his three-week furlough ended. The sect chief is serving a 20-year jail term for raping two women disciples at his ashram in Sirsa, where the 'dera' is headquartered. He was convicted by a special CBI court in Panchkula in August 2017.

డేరా బాబా పేరోల్ ముగిసింది.. మళ్లీ జైలుకు పయనం.

Posted: 02/28/2022 06:26 PM IST
Dera sacha sauda chief gurmeet ram rahim brought back to sunaria jail

పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయగల సంఖ్యలో తన భక్తులు ఉండటంతో.. వారిని తనవైపు మలుచుకునే పనిలో నిమగ్నమై.. తాను సూచించిన వ్యక్తులకే ఓటు మలుచుకోవడంలో సఫలమయ్యారో లేదా.. జైలు అధికారులకు చెప్పిన కారణాల కోసమే వచ్చిన కార్యాన్ని మాత్రమే చక్కబెట్టు కున్నారో తెలయియదు కానీ.. తనకు లభించిన మూడు వారాల పెరోల్‌ సమయం ముగియడంతో ఇవాళ డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా తిరిగి జైలుకు చేరుకున్నారు. తన ఆశ్రమంలో ఇద్దరు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే కేసులో ఆయనకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

మూడేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన డేరా బాబాకు కోర్టు మూడు వారాల పాటు పెరోల్ మంజూరు చేసింది. ఆదివారంతో గడువు పూర్తి కాగా, సోమవారం తిరిగి జైలుకు వెళ్లారు. డేరా చీఫ్‌ను గురుగ్రామ్ నుండి రోహ్‌తక్ జిల్లాలోని సునారియా జైలుకు భారీ భద్రతతో తీసుకువచ్చినట్లు రోహ్‌తక్ పోలీసు అధికారి తెలిపారు. ఆయనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించిన సంగతి తెలిసిందే. డేరా బాబా హార్డ్ కోర్ ఖైదీల కేటగిరీలోకి లేడని హర్యానా ప్రభుత్వం నిర్ధారించడంతో ఆయన విడుదలయ్యారు. మరోవైపు పంజాబ్ ఎన్నికలకు ముందు ఆయన విడుదల కావడం కూడా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles