Russian fighter jet shot down over Kyiv రష్యా యుద్దవిమానాన్ని పేల్చివేసిన ఉక్రెయిన్ సేనలు..

Russian fighter jet shot down over kyiv ukraine s interior ministry says

ukraine russia news, what is happening in ukraine, Russian military operation against Ukraine, Ukraine Russia War, Russia Invasion, Ukraine, Volodymyr Zelenskyy, Ukraine Crisis, Ukraine Russia Crisis, Ukraine crisis, Russia-Ukraine conflict, Ukrainian ambassador, Igor Polikha, Russia-Ukraine war, Ukraine-Russia crisis, Ukraine-Russia tension, Ukraine russia new, Prime Minister Narendra Modi,India on Ukraine, russia news, India

A Ukrainian Sukhoi Su-27 fighter jet was shot down over the capital, Kyiv, early Friday, according to Ukrainian Deputy Interior Minister Evgeny Yenin. Photos tweeted by the Ukrainian emergency forces appear to show a fire at a two-story house after fragments of a plane fell on it. It's unclear if those are the remnants of the Su-27 jet.

ITEMVIDEOS: రష్యా యుద్దవిమానాన్ని పేల్చివేసిన ఉక్రెయిన్ సేనలు.. కివ్ వంతెనను కూడా..

Posted: 02/25/2022 06:44 PM IST
Russian fighter jet shot down over kyiv ukraine s interior ministry says

ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రంపై ర‌ష్యా వైమానిక దాడులు చేస్తోంది. బాంబు పేలుళ్ల‌తో ఆ న‌గ‌రం ద‌ద్ద‌రిల్లుతోంది. క్రూయిజ్ లేదా బాలిస్టిక్ మిస్సైళ్ల‌తో ర‌ష్యా దాడికి దిగిన‌ట్లు భావిస్తున్నారు. అయితే గురువారం రాత్రి కీవ్ గ‌గ‌న‌త‌లంలోకి వ‌చ్చిన ర‌ష్యా విమానాన్ని కూల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ హోంశాఖ వెల్ల‌డించింది. రాత్రి పూట కీవ్ న‌గ‌రంపై పేల్చివేత‌కు గురైన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. సెంట్ర‌ల్ కీవ్ ప్రాంతంలో రెండు భారీ పేలుళ్లు జ‌రిగాయి. మ‌రో పేలుడు రాజధానికి దూర ప్రాంతంలో చోటుచేసుకున్న‌ట్లు అధికార వ‌ర్గాలు ద్వారా తెలుస్తోంది.

గురువారం రాత్రి కీవ్ లో జ‌రిగిన దాడికి సంబంధించి తొలుత స‌మాచారం రాలేదు. ఏదో గుర్తు తెలియ‌ని వ‌స్తువును పేల్చిన‌ట్లు తెలిపారు. కానీ ఆ త‌ర్వాత ర‌ష్యా యుద్ధ విమానాన్ని పేల్చిన‌ట్లు ఉక్రెయిన్ హోంశాఖ తెలిపింది. ఇక అంతకుముందు ఉక్రెయిన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ర‌ష్యా బ‌ల‌గాలు కీవ్‌లోకి ప్ర‌వేశించ‌కుండా ఉండేందుకు.. ఆ న‌గ‌రం స‌మీపంలో ఉన్న అత్యంత కీల‌క‌మైన బ్రిడ్జ్‌ను ఉక్రెయిన్ బ‌ల‌గాలు పేల్చేశాయి. ర‌ష్యా సైన్యం దూకుడును అడ్డుకునేందుకు ఆ బ్రిడ్జ్‌ను పేల్చిన‌ట్లు ఉక్రెయిన్ ర‌క్ష‌ణ మంత్రి తెలిపారు.

కీవ్‌కు ఉత్తరం దిక్కున 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టెట‌రివ్ న‌ది స‌మీపంలో ఉన్న బ్రిడ్జ్‌ను వైమానిక దాడుల‌తో పేల్చేశారు. కీల‌క‌మైన ఈ బ్రిడ్జ్‌ను పేల్చివేయ‌డం ద్వారా ర‌ష్యా బ‌ల‌గాల వేగాన్ని కొంత నిలువ‌రించ‌వ‌చ్చు అని ర‌క్ష‌ణ‌శాఖ తెలిపింది. బెలార‌స్ మార్గం ద్వారా ఉక్రెయిన్‌లోకి ఎంట‌రైన ర‌ష్యా బ‌ల‌గాలు.. కీవ్‌కు కేవ‌లం 32 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లు అమెరికా అధికారులు వెల్ల‌డించారు. ఇవాళ రెండ‌వ రోజు కీవ్‌లో బాంబుల మోత మోగింది. తొలి రోజే దాడిలో 137 మంది ఉక్రెయిన్ వాసులు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles