Revanth Reddy responds on Jagga Reddy's leaving Congress జ‌గ్గారెడ్డి పార్టీ వీడే అంశంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tpcc president revanth reddy responds on jagga reddy s leaving congress party

congress, jagga reddy, Sangareddy MLA, T JayaPrakash Reddy, A Revanth Reddy, Batti Vikramarkha, V Hanumantha Rao, TPCC working president, former MP V Hanumantha Rao, TPCC General Secretary, TPCC president, AICC president Sonia Gandhi, sangareddy, telangana Congress, Telangana, Politics

TPCC president A. Revanth Reddy, who was visiting Sammakka Sarakka festival in Mulugu district, described Mr. Jagga Reddy has his brother and that any differences would be sorted out. He termed the development as “a storm in a teacup.”

జ‌గ్గారెడ్డి పార్టీ వీడే అంశంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Posted: 02/19/2022 05:47 PM IST
Tpcc president revanth reddy responds on jagga reddy s leaving congress party

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. జగ్గారెడ్డి విషయం టీ కప్పులో తుఫాన్ లాంటిదని, ఆందోళన చెందాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలో బేధాభిప్రాయాలు ఉన్నాయని,  కాంగ్రెస్ పార్టీలో మాత్రమే భిన్నత్వంలో ఏకత్వముందని అన్నారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువని, అన్ని పరిస్థితులు సర్థుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి సీనియర్ నాయకుడని ఆయనను కలుసుకుని సమస్యలను పరిష్కరించు కుంటామని రేవంత్ అన్నారు.

ఇటీవల తాను పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, ఆవేశంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని రేవంత్ అన్నారు. కానీ అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మక్క -సారలమ్మల పోరాటమే తమకు స్ఫూర్తి అని, తెలంగాణ ఉద్యమానికి కూడా సమ్మక్క-సారలమ్మలే స్ఫూర్తి అని చెప్పారు. మేడారం మహా జాతరకు ప్రపంచ గుర్తింపు రావాల్సి ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదని,  ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మేడారం జాతరను విస్మరించిందని,  సమ్మక్క పోరాట స్ఫూర్తిని, తెలంగాణ అత్మగౌరవాన్ని కించపరిచారని విమర్శించారు.

సమ్మక్క చరిత్రను కనుమరుగు చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని,  చిన్నజీయర్ స్వామి, రామేశ్వరరావు నిర్మించిన ఆలయాలకు ఇచ్చిన విలువ.. సమ్మక్క జాతరకు ఇవ్వలేదని ఆరోపించారు. కృత్రిమమైన కట్టడం దగ్గర పొర్లు దండాలు పెట్టిన కేసీఆర్ కుటుంబం…మేడారం జాతరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ముచ్చింతల్ కు వచ్చిన ప్రధాని మోదీ మేడారం ఎందుకు రాలేదని రేవంత్ నిలదీశారు. సీఎం, పీఎం మేడారం జాతరను చిన్నగా చేసి చూపే కుట్ర చేస్తున్నారని,  మేడారం మహా జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.

ప్రతీ మేడారం మహా జాతరకు 500 కోట్లు కేటాయించాలని కోరారు. పేదల విశ్వాసాల పట్ల కేసీఆర్ కుటుంబానికి నమ్మకం లేదని,  తెలంగాణలో జిల్లాలను కుక్కచింపిన విస్తరిగా మార్చారని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరుపెడతామని రేవంత్ హామీ ఇచ్చారు. సీతక్క సంతకంతోనే ములుగు జిల్లాను తీసుకువస్తామని,  12 నెలల తర్వాత తెలంగాణలో సోనియమ్మ రాజ్యం వస్తదని, ఆ రాజ్యంలో సీతక్కకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.

సీఎల్పీ భట్టి విక్రమార్క స్పందన ఇలా

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామాపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. జగ్గారెడ్డి రాజీనామాపై ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడతానన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు సరికాదని సూచించారు. తాను బాధ్యత తీసుకుని సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో మాట్లాతానని భట్టి చెప్పారు. కొంతమంది వ్యక్తుల కోసం కాదని, పార్టీ కోసం పనిచేయాలని జగ్గారెడ్డికి చెప్పానన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై స్పందించవద్దని జగ్గారెడ్డికి చెప్పానన్నారు. పార్టీ అంతరంగిక విషయాలు కాబట్టి రాహుల్ గాంధీతో తాను మాట్లాడతానని చెప్పానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles