Arvind Kejriwal responds to Kumar Vishwas allegation కుమార్ విశ్వాస్ విమర్శలను తిప్పికోట్టిన అరవింద్ కేజ్రీవాల్

On kumar vishwas s arvind kejriwal attack a u turn 2 days before voting

Kumar Vishwas, Arvind Kejriwal, Election Commission, Rahul Gandhi, Aam Aadmi Party, AAP, Arvind Kejriwal, Delhi CM, Kumar vishwas, Terrorist, Anti national, Punjab Assembly Election 2022, BJP, Congress Party, Narendra Modi, aap, Punjab, Politics

The Election Commission removed its bar on broadcasting the explosive remarks of Kumar Vishwas against Arvind Kejriwal on Thursday, hours after leaders from both sides of the political divide -- Prime Minister Narendra Modi as well as Congress's Rahul Gandhi -- referred to the matter and attacked the Delhi Chief Minister.

కుమార్ విశ్వాస్ విమర్శలను తిప్పికోట్టిన అరవింద్ కేజ్రీవాల్

Posted: 02/18/2022 09:05 PM IST
On kumar vishwas s arvind kejriwal attack a u turn 2 days before voting

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో రాజకీయ పక్షాల మధ్య వాడివేడి విమర్శలు, అరోపణల పర్వం వేడందుకున్నాయి. ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని పార్టీల నేతలు తమవంతుగా ఇతర పార్టీలపై అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, ఆప్‌, శిరోమణి అకాళీదళ్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శల దాడులు చేసుకుంటున్నారు. నేతల తీవ్ర ఆరోపణతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజాగా ఆప్‌ మాజీ నేత కుమార్‌ విశ్వాస్‌.. ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ సీఎం వేర్పాటువాదులకు మద్దతిస్తున్నారని ఆరోపించడంపై కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. తాను ‘పంజాబ్ సీఎం లేదా ఖలిస్తాన్ ప్రధానమంత్రి’ కావాలనుకుంటున్నానని కుమార్ విశ్వాస్ చేసిన అరోపణలను తీవ్రంగా ఖండించారు, తాను ఉగ్రవాదినేని ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించి స్వీటెస్టు టెర్రరిస్టును అయ్యానంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం​ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. తాను వేర్పాటువాదిని అని ప్రధాని మోదీకి తెలిస్తే.. ఈ ఆరోపణలను ఎందుకు నిరూపించలేదని, దర్యాప్తు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.

తనను జాతీయ పార్టీల నేతలు (కాంగ్రెస్‌, బీజేపీ) దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలని చూస్తున్నారని, ఒక భాగానికి ప్రధానిని కావాలని ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. తాను నిజంగా వేర్పాటు వాదిని, టెర్రరిస్టుని అయితే.. కేంద్ర భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయి. ప్రధాని మోదీజీ నన్ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు. వారు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా అని మాటల తూటాలు పేల్చారు. ఈ సందర్భంగానే అన్ని పార్టీలు అవినీతిమయం అయ్యాయంటూ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఆప్‌ను ఓడించేందుకు అందరూ కలిసిపోయారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంతకు ముందు కుమార్‌ విశ్వాస్‌ చేసిన ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. కొందరు వ్యక్తులు పంజాబ్‌ను విభజించాలని కలలు కంటున్నారు. వారు అధికారంలోకి రావడం కోసం వేర్పాటువాదులతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. మరోవైపు 'వేర్పాటువాదం' ఆరోపణలపై విచారణ జరిపించాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రధాని మోదీని కోరారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 20వ తేదీన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుంది. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles