Booster dose certificate to dead man in Kothagudem చనిపోయిన వ్యక్తికి కరోనా బూస్టర్ డోస్..!

Booster dose certificate to dead man in kothagudem

booster dose to dead man, booster dose certificate to dead man, CoWin app, man dead on feb 11 booster dose on feb 16, Kotha Malla Reddy, retired head master, New Gollagudem, Bhadradri Kothagudem district, booster dose certificate, social media, viral post, Telangana

In a bizarre case, a dead man from Kothagudem in Telangana was issued certificate for booster dose of vaccine by the Ministry of Health. Going into details, Kotha Malla Reddy, a retired head master from New Gollagudem in Bhadradri Kothagudem district passed away on February 11. However, he was given the certificate for getting the booster dose of vaccine on February 16.

చనిపోయిన వ్యక్తికి కరోనా బూస్టర్ డోస్.. ఎలా ఇచ్చారు చెప్మా.!

Posted: 02/17/2022 06:42 PM IST
Booster dose certificate to dead man in kothagudem

కరోనా వైరస్ మహమ్మారిని కంటికి కనబడని శత్రువని ఇప్పటికే ఎందరెందరో ఎన్నో పేర్లు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపిన ఈ మహమ్మారిని మరెందరిపైనో తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనిని ఎదుర్కోవడంలో మానవాళి వద్ద ఉన్న ఒకే దివ్యౌషధం కరోనా వాక్సీన్. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దేశ ప్రజలందరికీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అదేశాలతో అన్ని రాష్ట్రాలు విధిగా ప్రతీ ఇంటికి వెళ్లి ఆయా సభ్యులను విచారించి మరీ కరోనా వాక్సీన్ తీసుకున్నారా.? లేదా.? అని తెలుసుకుని.. ఎవరైనా తీసుకోని వారుంటే వారికి వాక్సీన్ ఇస్తున్నారు.

ఎందుకంటే ఈ మహమ్మారి గురించి ఏమీ తెలియని 2020 జనవరి అనంతర పరిణామాల కన్నా.. వాక్సీన్ అందుబాటులోకి వచ్చిన తరువాత గత ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు చూపిన రెండవ దశలో జరిగిన నష్టమే అధికం. అందుకు కారణం కరోనా పోయిందన్న నిర్లక్ష్యం అవహించడం. ఇక మరలా రాదు అన్న అపనమ్మకం. దీంతో అనేకమంది కరోనా బారిన పడి అసువులు బాసారు. చాలా మందికి జీవవాయువు (ఆక్సిజన్) అత్యవసరమైంది. అక్సిజన్ కూడా అనేక అసుపత్రులలో అందుబాటులో లేకపోయింది. చివరకు కరోనా ను చికిత్స చేసే ఔషదం (రెమిడిసివీర్) కూడా కొరత ఏర్పడింది.

ఆ తరువాత ప్రభుత్వాలు కరోనాను తరిమే బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకుని వాక్సీన్ ఇస్తున్నాయి. ఒక్కరు వాక్సీన్ తీసుకోకపోయినా. కరోనా వారిలోనే మరో విధంగా రూపాంతరం చెంది మరో వేరియంట్ బయటకు రావచ్చునన్న అందోళన సర్వత్రా నెలకొనింది. దీంతో అరోగ్య కార్యకర్తలు, పిహెచ్సీల సిబ్బంది వాక్సీన్ ను అందరికీ అందిస్తున్నారు. ఈ క్రమంలో 60 ఏళ్లు పైబడిన వృద్దులకు కరోనా బూస్టర్ డోస్ ను ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రద్రి కొత్తగూడెం జిల్లాలో అరోగ్య కార్యకర్తల నిర్వాకంతో తెలంగాణ అరోగ్యశాఖ అప్రదిష్టను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటారా.? ఈ జిల్లాలోని కొత్త గొల్లగూడెం ప్రాంతానికి చెందిన కొత్త మల్లారెడ్డి అనే రిటైర్డు హెడ్ మాస్టారు.. ఈ నెల 11న మరణించారు. అయితే అతని కుటుంబసభ్యులతో పాటు బంధువర్గం ఆయన అంత్యక్రియలను నిర్వహించిన తరువాత ఇక దశదిన కర్మ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో మల్లారెడ్డి కుటుంబసభ్యులకు ఒక ఫోన్ సందేశం (ఎస్ఎంఎస్) వచ్చింది. అది చూసి వారు షాక్ కు గురయ్యారు. ఈ వార్తను వారు తమ సామాజిక మాద్యమాల ద్వారా తమ స్నేహితులకు షేర్ చేశారు. అది చూసి నివ్వెరపోయిన స్నేహితులు కూడా విపరీతంగా షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ సందేశంలో ఏముందీ.? తమ తండ్రికి జిల్లా అరోగ్య కార్యకర్తలు ఈ నెల 16వ తేదీని బూస్టర్ డోస్ ఇచ్చినట్లు సందేశంలో పేర్కోనబడింది. దీంతో కుటుంబసభ్యులు విస్తుపోయారు. కోవిన్ యాప్ తెరచి చూస్తే నిజంగానే తమ తండ్రి పేరున బూస్టర్ డోస్ తీసుకున్నట్లు నమోదు కావడంతో పాటు ఆయన పేరున సర్టిఫికేట్ కూడా విడుదలైంది. ఇందులో ఆశ్చర్యమేముంది.. మరణించేందుకు ముందు తీసుకుని ఉండోచ్చన్న అనుమానామే అవసరం లేదు., ఎందుకంటే మల్లారెడ్డి మరణించింది 11వ తేదీన కానీ బూస్టర్ డోస్ తీసుకున్నది 16వ తేదీన.. అదెలా సాధ్యమని వారి తనయులు ప్రశ్నిస్తున్నారు. ఇక తమ తల్లి వాక్సీన్ తీసుకోకపోయినా.. ఇదే విధంగా సందేశం వచ్చిందని వారు పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles