Case on Assam CM: TPCC leaders under house arrest రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతల గృహనిర్భంధం..

Telangana congress leaders under house arrest to prevent dharna against assam cm

Assam CM, Himanta Biswa Sarma, TPCC, Revanth Reddy, Mohammed Ali Shabbir, MP Komatireddy Venkat Reddy, House Arrest, dharna at Police Commissionerates, dharna at SP offices, Congress, Sonia Gandhi, Rahul Gandhi, FIR on Himanta Biswa Sarma, Telangana, Politics

As the Congress leaders were gearing up for protest rallies and dharna at the City Police Commissionerate and SP offices as part of building pressure against Assam CM, Himanta Biswa Sarma, the police placed them under house arrest. Leaders including PCC chief, A Revanth Reddy, former Minister Mohammed Ali Shabbir, MP Komatireddy Venkat Reddy were placed under house arrest by Hyderabad police.

రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతల గృహనిర్భంధం.. ధర్నాల ఉపసంహరణ

Posted: 02/16/2022 03:18 PM IST
Telangana congress leaders under house arrest to prevent dharna against assam cm

రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్‌ నేతలను, ఎమ్మెల్యేలు, ఎంపీలను, సీనియర్ నేతలను ఇవాళ పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు కమీషనరేట్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు పిలుపునివ్వడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు సిద్దమవుతుండగా, ఉదయం వారి నివాసాలకు బందోబస్తుతో వెళ్లిన పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు. ముఖ్య నేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

అసోం సీఎం హిమాంత విశ్వశర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 700పైగా పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇవాళ ధర్నాలు చేపడతామని ఇదివరకే ప్రకటించారు. అందుకు ప్రతిగా పోలీసులు గృహనిర్బంధాలు చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రేవంత్‌రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టాముట్టారు. ఇంటివద్ద భారీగా పోలీసులను మోహరించి... ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బయటకు రాకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

అటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా ఇంట్లోంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. నిజామాబాద్‌లో మధుయాష్కిని, కామారెడ్డికి వెళ్లకుండా షబ్బీర్‌ అలీని అడ్డుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశామని పోలీసులు రేవంత్​ రెడ్డీకి చెప్పగా... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ధర్నాలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. కాగా ధర్నా సమయంలో అరెస్టయిన వారిని విడుదల చేయాలని ఆయన పోలీసులను కోరారు. ఇక పోలీసులు నమోదు చేసిన కేసుతో అపరేషన్ సక్సెస్..పేషంట్ డెడ్ అన్న విధంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

దీంతో తాము సూచించిన సెక్షన్ల మేరకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై ఆయన మరో ఫిర్యాదు చేశారు. మొదటి ఫిర్యాదులో పేర్కొన్న అంశాల మేరకు కేసు నమోదు చేయలేదన్నారు. నామమాత్రపు కేసు నమోదు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. పోలీసులు తన ఫిర్యాదు స్వరూపాన్ని మార్చారని పేర్కొన్నారు. బిశ్వశర్మపై మరోసారి ఫిర్యాదు చేసిన రేవంత్‌... సంబంధింత సెక్షన్ల ప్రకారమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఒక రాష్ట్రముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతూ ఆయన చేసిన నీచమైన వ్యాఖ్యలను యావత్ దేశం ముక్తకంఠంతో ఖండిస్తుందని, ఈ వ్యాఖ్యలపై పోలీసులు ఎఫ్ఐఆర్ కాఫీని నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఎఫ్ఐఆర్ కాపీని చూపించిన పక్షంలోనే తాము అందోళనలపై వెనక్కు తగ్గుతామని అన్నారు. వ్యవస్థపై దాడి జరిగితే ఎవరైనా, ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు. జాతీయ స్థాయి మహిళా నేతను అవమానించేలా అసోం సీఎం మాట్లాడారు. హిమంత బిశ్వశర్మపై నామమాత్రపు కేసు నమోదు చేస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. తాను సూచించిన సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పిన ఆయన.. అసోం సీఎంని రక్షించేలా పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలోని ఒక ఘటనపై పిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఏంటని.. రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles