Revanth Reddy-Komatireddy bonhomie shocks Rivals! కొమటిరెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి కలసిన రేవంత్ రెడ్డి

Tpcc chief revanth reddy meets komatireddy in lotus pond

Revanth Reddy meets Komatireddy Venkat Reddy at Lotus pond, Revanth Reddy meets Komatireddy Venkat Reddy, Revanth reddy meets Komatireddy, Revanth Reddy, TPCC President, Komatireddy Venkat Reddy, Bhongir MP, Congress senior leader, Congress, Rival Political Parties, Nalgonda, telangana, Politics

TPCC President A Revanth Reddy and Congress senior leader and Bhongir Lok Sabha member Komatireddy Venkat Reddy displayed unusual bonhomie on Tuesday. Both were seen shaking hands, hugging each other and discussed political issues. The visuals of which went viral on socialmedia platforms. These Happy movements pictures surprised not just Congress leaders and cadre but also shocked the political rivals.

రేవంత్ రెడ్డికి ఆత్మీయ ఆహ్వానం పలికిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Posted: 02/15/2022 06:34 PM IST
Tpcc chief revanth reddy meets komatireddy in lotus pond

కాంగ్రెస్‌లో రెండు భిన్న ధ్రువాలుగా పేరున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.., ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంగళవారం కలిశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్‌ అయ్యాక మొదటిసారి కోమటిరెడ్డిని రేవంత్‌రెడ్డి కలిశారు. ఇద్దరూ కలిసి సీఎం కేసీఆర్‌నే టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. అయితే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను రేవంత్‌రెడ్డి తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దానికి హ్యాపీ టైమ్స్ అని కామెంట్ జత చేశారు. ఇక ఇద్దరు లీడర్లు ఒకే ఫ్రేమ్‌లోకనిపించడంతో అటు పార్టీలో, ఇటు రాజకీయపరంగా చర్చనీయాంశంగా మారింది.

కోమటిరెడ్డిని కలిసినన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ కుటుంబం దొంగ రాజీనామాలు చేసిందని దుయ్యబట్టారు.. అస్సాం సీఎంపై ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కేసులు నమోదు కాలేదన్న రేవంత్‌రెడ్డి.. రేపు ఎస్పీ, కమిషనరేట్లను ముట్టడిస్తామని పేర్కొన్నారు.  కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి కోవర్టు అని ఆరోపించారు. ఈ కోవర్టు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్టు నటించి, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు దగ్గరై వాళ్ల మధ్యన చిచ్చు పెడతాడని వివరించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చి, మోదీ పీఠాన్ని పదిలం చేయడానికి ప్రయత్నిస్తాడని అన్నారు.

మోదీకి అనుకూలంగా పనిచేయడానికి ఈ కోవర్టు గ్యాంగ్ సుపారీ తీసుకుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.మోదీ కోసమే కేసీఆర్‌ పనిచేస్తున్నారని, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎప్పటికీ కలబోవని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ‘కర్షకుల కోసం కాంగ్రెస్‌’ అంటూ కాంగ్రెస్‌ వరి దీక్షలకు దిగింది.  రైతుల సమస్యలపై ఇందిరాపార్క్‌లో జరిగిన దీక్షలో రేవంత్.. కోమటిరెడ్డికి తోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకే వేదికపై కనిపించారు. దీంతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా కోమటిరెడ్డి, రేవంత్‌ రెడ్డి కలిసిపోవడంతో క కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజం నిండిందనే చెప్పవచ్చు. ఎప్పటి నుంచో కొంత అస్పష్టతతో ఉన్న కార్యకర్తల్లోని అనుమానాన్ని ఈ రోజు వరి దీక్ష వేదిక నుంచి కోమటిరెడ్డి, రేవంత్‌ రెడ్డిలు తరిమికొట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles