Two youths escape confrontation with tiger by climbing tree పెద్దపులి కనిపించడంతో.. చెట్టెక్కిన యువకులు.. గంట పాటు అక్కడే..

Viral video on confrontation with tiger two young man climbed the tree leaving bike

Two youths escape confrontation with tiger in Panna, tiger came in front of youths, youths climbed on tree to see youths, panna tiger reserve park, mp latest video, local news, tiger viral video, tiger stop way and sit on road, youths on tree to seen tiger, mp news update, mp tiger video,

Two youths in Panna, Madhya Pradesh, cleverly escaped from the clutches of a tiger. They climbed the tree and held the survivors in the palm of their hands for hours. On their way to the Jhularia Mahadev Temple inside the Panna Tiger Reserve, they suddenly saw a tiger. Fearing for their lives, the bike landed on a nearby tree. Some devotees on their way to the temple filmed these scenes on their phones.

ITEMVIDEOS: పెద్దపులి కనిపించడంతో.. చెట్టెక్కిన యువకులు.. గంట పాటు అక్కడే..

Posted: 02/14/2022 07:01 PM IST
Viral video on confrontation with tiger two young man climbed the tree leaving bike

అడవిలో వెళ్తెున్న సమయంలో పెద్దపులి ఎదురైతే.. ఏం చేస్తారు.? అమ్మో అంటూ గుండెలు పట్టుకుంటారు. వెంటనే దాని బారిన పడకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే పులి దాడి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఇటీవల ఓ కర్ణాటకవాసి చేసిన పోరాటం గురించి విన్నాం. ఇక ఆ తరువాత ఓ తల్లి తన బిడ్డను పులి నుంచి రక్షించుకునే పోరాటాన్ని కూడా విన్నాం. కానీ పులి అనగానే దుర్గమ్మవారి వాహనమనే కోందరితో పాటు.. పులిని చూని భయపడే కొందరు దాని నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాల్లో చెట్టు ఎక్కడం ఒక్కటి.

ఇక్కడ కూడా ఓ ఇద్దరు యువకులు పులిని చూడగానే చటుక్కున చెట్టు ఎక్కేశారు. అంతకుముందు వారికి అలా చెట్టు ఎక్కే అలవాటు ఉందో లేదో తెలియదు కానీ.. పులిని చూడగానే వారికి భయంతో చెట్టు ఏక్కేయడం వచ్చేసింది. ఇందులో వింత ఏముంది అంటారా.. వారిద్దరూ పులి నుంచి తప్పించుకునేందుకు ఏకంగా గంటకు పైగానే చెట్టుపై గడిపారు. తమ పంచ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని చెట్టుపైనే వున్నారు. ఇక పులి తమ సమీపం నుంచి నిష్క్రమించిందని తెలిసిన తరువాత యువకులు జాగ్రత్తగా చెట్టు దిగి వెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని పన్నా టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ లోని పన్నాలోపల ఉన్న ఝలారియా మహాదేవ్ ఆలయం ఏడాదికి ఓ పర్యాయం మాత్రమే భక్తుల సందర్భనార్థం తెరుస్తారు. మిగతా సమయాల్లో ఆలయంలో కేవలం పూజారులు మినహా భక్తులకు అనుమతి లభించదు. దీంతో ఇటీవల తెరచిన ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పలువురు వాహనాల్లో వెళ్లారు. అయితే ఇద్దరు యువకులు మాత్రం బైక్ పై బయలుదేరారు. మార్గమధ్యంలో వారికి పెద్దపులి కనిపించింది. దీంతో అప్రమత్తమైనవారు ప్రాణభయంతో బైక్ అక్కడే వదిలేసి చెటుకున్న చెట్టు ఎక్కారు. కార్లలో గుడికి వెళ్తున్నవారు కూడా పులి రోడ్డుపైనే సేద తీరడంతో వేచివున్నారు. ఆ తరువాత చెట్టు ఎక్కిన ఇద్దరి దృశ్యాలను తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles