Shiv Sena Raut Warns Centre, Probe Agencies రూ.10 నాణేలతో అన్ని లావాదేవీలు జరుపొచ్చు: కేంద్ర ఆర్థికశాఖ

Will expose criminal syndicate sena mp warns centre probe agencies

Sanjay Raut, Shiv Sena MP, sensational claims, Maharashtra government, Maha Vikas Aghadi government, Uddhav Thackeray, Rajya Sabha chairman, Venkaiah Naidu, Criminal Syndicate, Evidences, Central Agencies, Enforcement Directorate, harassment, Maharashtra, Politics

Shiv Sena MP Sanjay Raut, made sensational claims in a letter to the Rajya Sabha chairman, today said that he has all the evidence to back up his claims and would reveal them at the right time. Mr Raut had alleged that the Enforcement Directorate has been harassing him and his family after he refused to help in toppling the Maharashtra government.

‘మహా’ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ‘క్రిమినల్ సిండికేట్’: సంజయ్ రౌత్ సంచలన అరోపణలు

Posted: 02/10/2022 05:15 PM IST
Will expose criminal syndicate sena mp warns centre probe agencies

శివసేన రాజ్యసభ సభ్యుడు, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన అరోపణలు చేశారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడి (ఎంవీఎస్) ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాయం కావాలంటూ కొందరు వ్యక్తులు తననే సంప్రదించారని, కలసి రాకుంటే జైలుకు పంపుతామని బెదిరించారని ఆరోపించారు. మహారాష్ట్రలోని ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీజేపి.. ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేసిందని.. అయితే అవి సాధ్యంకాకపోవడంతో ఇప్పుడు మరో రకంగా ప్రణాళికను రచిస్తోందని ఆయన అరోపించారు.

ఇన్నాళ్లు శరద్ పవార్ ను టార్గెట్ చేసిన బీజేపి సహా కేంద్రంలోని సెంట్రల్ ఏజెన్సీలు ఇక ఇప్పుడ తనను, థాకరే కుటుంబాలను కూడా లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు రచిస్తున్నాయని ఆయన అరోపించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏకంగా ముఖ్యనేతలనే టార్గెట్ చేశారని ఆయన అరోపించారు. సాయం చేసేందుకు తాను నిరాకరించడంతో బెదిరింపుల పర్వానికి దిగుతున్నారని కూడా ఆయన అరోపించారు. రైల్వే మాజీమంత్రిలా కొన్ని సంవత్సరాలపాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని తనను హెచ్చరించారని అన్నారు. ఈ బెదిరింపుల విషయాలన్నీ పేర్కొంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఆయన ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈడీ వంటి సంస్థలను వాడుతున్నారని ఆరోపించారు. ఫిర్యాదు లేఖ ప్రతులను తమ కూటమిభాగస్వామ్య పక్షాలకు కూడా సంజయ్ రౌత్ పంపించారు. అంతేకాదు, ఇదే విషయాన్ని ట్విట్టర్‌లోనూ షేర్ చేశారు. ఝకేంగే నహీ.. జై మహారాష్ట్ర (తగ్గేదే లేదు.. జై మహారాష్ట్ర) అని క్యాప్షన్ తగిలించారు. తమ కూటమి ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుందని రౌత్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ లేఖ ట్రైలర్ మాత్రమేనని, బీజేపీతో కలిసి ఈడీ అధికారులు క్రిమినల్ సిండికేట్‌గా ఎలా మారారో కూడా బయట పెడతానని రౌత్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles