Villagers Mourn Death of Sparrow పిచ్చుకకు అంత్యక్రియలు.. సమాధి కూడా కట్టిన గ్రామస్థులు.!

Villagers mourn death of sparrow that brightened their days

Karnataka Sparrow, Karnataka Sparrow News, Sparrow, Basavapatna villagers, sparrow villagers, Shidlaghatta taluk, Shidlaghatta taluk sparrow, sparrow Chikkaballapur district, Chikkaballapur sparrow, sparrow, affection, villagers, republic day, final rites, tomb, dashadinakarma, basavapatna, shidlaghatta, chikkaballapur, karnataka, Bio-diversity, karnataka news

The people of a village in Karnataka had developed an immense affection for a sparrow. That sparrow died a few days ago. This plunged the villagers into deep sorrow. The villagers at Basavapatna in Shidlaghatta taluk of Chikkaballapur district, Karnataka gathered at a spot and mourned the death of the sparrow who visited every household every day without fail and people had an emotional attachment to it.

భూతదయ: పిచ్చుకకు అంత్యక్రియలు.. సమాధి కూడా కట్టిన గ్రామస్థులు.!

Posted: 02/09/2022 12:27 PM IST
Villagers mourn death of sparrow that brightened their days

తాము ఇష్టపడే వారి ఇక లేరు అన్న వార్త ఎంతటి భాధకు గురిచేస్తుందో మాటల్లో చెప్పనలవి కాదు. అలాంటి ఘటనలు తాము ప్రేమించిన మూగజీవాలైతే.. వాటితో అనుభంధం పెంచుకునే చిన్నారుల నుంచి ఇంట్లోని పెద్దల వరకు అందరూ అందోళన చెందుతారు. కన్నీటి పర్యంతమవుతారు. అలాంటిది ఓ గ్రామమే ఓ జీవిపై అపారమైన ప్రేమాభిమానం పెంచుకుంటే.. యావత్ గ్రామంలో విషాధవాతావరణం అలుముకుంటుంది. కర్ణాటకలోని ఓ గ్రామంలో అచ్చంగా ఇదే జరిగింది. నిత్యం తమ దైనందిక జీవితంలో భాగమై తమ ఇళ్లకు ఉదయాన్నే వచ్చే పిచ్చుక అకస్మాత్తుగా మరణించడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

గ్రామంలోని అందరి ఇళ్లకు ఉదయాన్నే వచ్చి వారి దైనందిక జీవితంలో ఇంటి సభ్యురాలిగా మారి.. తన కూతలతో గుడ్ మార్నింగ్ అని చెబుతూ.. గ్రామస్థులు వేసే గింజలు తింటూ వారితో కలివిడిగా ఉండే పిచ్చుక మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీని మృతిని జీర్ణించుకోలేకపోయారు. దానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి, సమాధి నిర్మించారు. ప్రతీరోజు తమ ఇళ్లకు వచ్చి తాము పెట్టే అహారం తినే పిచ్చుక అకస్మాత్తుగా మరణించడం తమను విషాదంలోకి నెట్టిందని గ్రామస్థులు తెలిపారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా శిద్లగట్ట మండలం బసవనపట్టణ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

గ్రామంలో చాలా పిచ్చుకలు ఉండగా వాటిలో ఒకటి మాత్రం ప్రతి రోజూ అన్ని ఇళ్లకు వచ్చేది. వారు వేసే గింజలు తిని వెళ్లేది. దీంతో ఆ పిచ్చుకపై గ్రామస్థులు ఎనలేని మమకారం పెంచుకున్నారు. గత నెల 26న ఆ పిచ్చుక అకస్మాత్తుగా మరణించింది. అది చూసి గ్రామస్థులు తట్టుకోలేకపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. మనుషుల్లా దానికీ అంత్యక్రియలు నిర్వహించారు. దశదిన కర్మ జరిపించి సమాధి కూడా కట్టించారు. మళ్లీ తిరిగి రావాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ గ్రామంలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం అందరికీ భోజనాలు పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles