PM Modi insulted people of Telangana: Revanth redddy ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు..

Pm modi insulted people of telangana revanth redddy fires on bjp

narendra modi, congress, PM Modi Congress, budget session, congress, rajya sabha, parliament, motion of thanks, Revanth Reddy, Telangana, corona congress parliament, motion of thanks, National, Politics

Congress hit back at PM Modi for highlighting the fact that the party failed to win in Telangana despite claiming credit for the creation of the state. Maintaining that the Sonia Gandhi-led party did not form Telangana for the sake of winning polls, Telangana Pradesh Congress Committee (TPCC) president Revanth Reddy told the media that PM shouldn't have raked up this point.

ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు..

Posted: 02/08/2022 07:29 PM IST
Pm modi insulted people of telangana revanth redddy fires on bjp

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగిన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అగ్గిరాజేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అమరవీరుల ప్రాణత్యాగాలను ప్రధాని అవహేళన చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్న బీజేపి.. కాకినాడ తీర్మాణం చేసిన తరువాత 2014లోనే ఎందుకు రాష్ట్ర విభజనను చేపట్టలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. సుఖ ప్రసవం చేస్తామని.. చెప్పి మూడు రాష్ట్రాలను విభజించించిన బీజేపి తెలంగాణను ఎందుకు వదిలేసిందని.. తెలంగాణ ద్రోహి బీజేపి అని దుయ్యట్టారు.

ప్రధాని వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. ఎక్కడికక్కడ మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని సబ్ కా సాత్ అన్నది మాటల వరకేనని, ఆయనలో ఇప్పటీకీ విభజించి పాలించు అనే తత్వమేనని రేవంత్ దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ మోసం చేశారని రేవంత్ విమర్శించారు. బీజేపీ సీనియర్లను మోసం చేసి మోదీ ప్రధాని అయ్యారని అన్నారు. మోడీ మాటల్లో ప్రేమను కనబరుస్తారు కానీ వాస్తవంలో ప్రజలను విడదీసి రాజకీయ స్వలాభాన్ని వెతుక్కుంటారని ఆయన దుయ్యబట్టారు.

ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అంటూ తెలంగాణలో బీజేపీ ప్రచారం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన వాజ్ పేయి... తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించారని అన్నారు. అప్పట్లోనే తెలంగాణను ఇచ్చి ఉంటే వందలాది మంది ప్రాణాలు పోయేవి కాదని చెప్పారు. ఏపీపై ఎంతో ప్రేమను కనబరుస్తున్న ప్రధాని.. ఏపీకి తన ఎనమిదేళ్ల హయాంలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఏపీ నేతలు ఎంతో ఒత్తిడి చేసినా సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని అన్నారు. ఒక రాష్ట్రంలో పూర్తిగా నష్టపోతామని తెలిసినా తెలంగాణను ఇచ్చారని చెప్పారు.

ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య దీటుగా స్పందించారు. గతంలో బీజేపీ మూడు ప్రత్యేక రాష్ట్రాలను ఇచ్చిందని, అప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎందుకు గెలవలేదని పొన్నాల ప్రశ్నించారు. ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదన్న అంశాన్ని ప్రధాని మోదీ గుర్తించాలని హితవు పలికారు. ఏదేమైనా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంగీకరించారని పొన్నాల పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని, అంతటి మహోన్నత పార్టీని టుక్డే టుక్డే పార్టీ అనడం సరికాదన్నారు. అయినా మోదీ పాలనలో ఏం ఒరిగిందని పొన్నాల నిలదీశారు. పారిశ్రామికవేత్తలకు మేలు చేశారే తప్ప సామాన్యులు ఏంచేశారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles