Manipal student packs girlfriend in suitcase సూట్ కేసులో గర్ల్ ఫ్రెండ్ ను ప్యాక్ చేసి.. హాస్టల్ లోకి తీసుకెళ్లబోయి..

Manipal student tries to sneak girlfriend into hostel in a suitcase

karnataka sutdent, MIT Manipal, Engineering student, twitter, memes, manipal, suitcase, boy, tries, sneak, girlfriend, inside, hostel, viral video

An engineering student at the Manipal Institute of Technology in Karnataka’s Udupi was caught trying to sneak his girlfriend into his hostel by stuffing her into a large suitcase. The student was caught after the caretaker became suspicious of the bulging suitcase and proceeded to further investigate.

ITEMVIDEOS: సూట్ కేసులో గర్ల్ ఫ్రెండ్ ను ప్యాక్ చేసి.. హాస్టల్ లోకి తీసుకెళ్లబోయి..

Posted: 02/05/2022 04:54 PM IST
Manipal student tries to sneak girlfriend into hostel in a suitcase

దురదృష్టమేంటో కానీ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కొన్నిసార్లు దొరికిపోతుంటారు కొందరు. ఈ విషయంలో విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేసేవారు ముందు వరుసలో ఉంటారు. శరీర అంతర్భాగాల్లో దాచుకుని స్మగ్లింగ్ చేసినా పట్టుబడి కటకటాల పాలవుతుంటారు. తాజాగా, అలాంటి అనుభవమే ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఎదురైంది. కాలేజీలో చదువుకుంటూ నిత్యం తన గర్ల్ ఫ్రెండ్ గురించి అలోచించి.. చదువుపై శ్రద్ద వహించలేక పోతున్న విద్యార్థి.. తన హాస్టల్ గదికే గర్ల్ ఫ్రెండ్ ను తీసుకువస్తే ఎంత బాగుండు. ఇద్దరం కలసి ఎంచక్కా చదువుకోవచ్చు. ఇక ముచ్చట్లు కూడా పెట్టుకోవచ్చు అనుకున్నాడు.

అయితే తన హాస్టల్ లోకి గర్ల్ ఫ్రెండ్ ను తీసుకురావడం ఎలా అని విపరీతంగా అలోచించాడు. ఓ మంచి ప్లాన్ వేశాడు. అంతే ఇక ఆలస్యం చేయకుండా తన ప్లాన్ ను అదే కాలేజీలో చదువుకుంటున్న గార్ల్ ఫ్రెండ్‌తో పంచుకున్నాడు. అమె కూడా ప్రియుడి ఫ్లాన్ కు అంగీకరించింది. అనుకున్నదే తడవుగా ఓ పెద్ద ట్రాలీ సూట్‌కేసులో అమ్మాయిని కుక్కేసి ఎవరికీ అనుమానం రాకుండా హాస్టల్‌కు తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, ప్లాన్ బెడిసికొట్టడంతో కాలేజీ నుంచి ఇద్దరూ సస్పెండయ్యారు. కర్ణాటకలోని ఎంఐటీ మణిపాల్ హాస్టల్‌లో జరిగిందీ ఘటన.

అంతపెద్ద ట్రాలీ సూట్‌కేసును లాక్కొస్తున్న విద్యార్థిని గమనించిన హాస్టల్ వార్డెన్ అనుమానంతో అతడిని ఆపాడు. అందులో ఏమున్నాయని ప్రశ్నించాడు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులు ఉన్నాయని బదులులిచ్చాడు. అయితే, విద్యార్థి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ట్రాలీని బలవంతంగా తెరిపించాడు. ఆ వెంటనే అందులోంచి బయటపడిన అమ్మాయిని చూసి వార్డెన్ అవాక్కయ్యాడు. దీంతో ఇద్దరినీ సస్పెండ్ చేసి ఇంటికి పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka sutdent  MIT Manipal  Engineering student  twitter  memes  manipal  suitcase  boy  tries  sneak  girlfriend  inside  hostel  viral video  

Other Articles