SBI New Rules: IMPS transaction charges changed ఐఎంపీఎస్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచిన స్టేట్ బ్యాంక్

New sbi money transaction rules change in imps charges and limits

SBI, SBI IMPS, SBI IMPS charges, money transfer, New SBI money transaction rules, State Bank of India (SBI),Immediate Payment Service (IMPS),Immediate Payment Service (IMPS),Personal Finance News, Business News

The State Bank of India (SBI), has increased the limit on its immediate payment service (IMPS) transactions. In order to encourage customers to adopt digital banking, the lender has enhanced the free IMPS online transactions limit to ₹5 lakh from ₹2 lakh. As of February 1, customers can make transactions up to ₹5 lakh instead of the earlier ₹2 lakh limit, the bank announced.

ఐఎంపీఎస్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచిన స్టేట్ బ్యాంక్

Posted: 02/04/2022 12:42 PM IST
New sbi money transaction rules change in imps charges and limits

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) నగదు బదిలీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. అలాగే, ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా నిర్వహించే ఈ-లావాదేవీలపై ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. బ్యాంకు శాఖల వద్ద నిర్వహించే లావాదేవీలకు మాత్రం రుసుము వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. రూ. 2 లక్షల వరకు లావాదేవీలకు పాత రేట్లే వర్తిస్తాయని తెలిపింది.

అయితే, రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లావాదేవీలను బ్యాంకు శాఖల ద్వారా నిర్వహిస్తే రూ. 20 వసూలు చేస్తామని, దీనికి జీఎస్‌టీ అదనమని వివరించింది. బ్యాంకు బ్రాంచుల వద్ద రూ. 1000 వరకు చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు ఎలాంటి చార్జీలు వర్తించవు. కాగా, రూ. 1000  నుంచి రూ. 10 వేల వరకు రూ. 2 రుసుముతోపాటు అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు 4 రూపాయలకు తోడు జీఎస్టీ, లక్ష నుంచి 2 లక్షల వరకు రూ. 12 రుసుముకు తోడు జీఎస్టీ, రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జరిపే లావాదేవీలపై రూ. 20 రుసుము, అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles