ED arrests Bhupinder Singh nephew of Punjab CM పంజాబ్ ఎన్నికల ముందు సీఎం చన్నీ మేనల్లుడి అరెస్ట్..

Punjab polls ed arrests cm channi s nephew in sand mining case

charanjit singh channi illegal sand mining case sand mining case illegal sand mining case news updates bhupinder singh honey punjab cm channi nephew bhupinder singh honey bhupinder singh honey arrested, punjab cm, charanjit singh channi, illegal sand mining case, bhupinder singh honey, channi nephew bhupinder singh honey, punjab, politics

The Enforcement Directorate arrested Punjab Chief Minister Charanjit Singh Channi's nephew, Bhupinder Singh Honey, under money laundering charges, in the illegal sand mining case late. Honey was placed under arrest under the Prevention of Money Laundering Act (PMLA) by the ED officials in Punjab after nearly eight hours of questioning.

ITEMVIDEOS: పంజాబ్ ఎన్నికల ముందు సీఎం చన్నీ మేనల్లుడి అరెస్ట్..

Posted: 02/04/2022 11:16 AM IST
Punjab polls ed arrests cm channi s nephew in sand mining case

పంజాబ్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సీంగ్ చన్ని మేనల్లుడు భూపేందర్ సింగ్ అరెస్ట్‌ కావడం పట్ల రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అక్రమ ఇసుక రవాణ వ్యవహారంలో ఆయనను గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించిన ఈడీ అధికారులు సాయంత్రం పొద్దుపోయిన తరువాత అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలపై బురదజల్లేందుకు కేంద్రం ఒత్తిడి మేరకు ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ ఈ చర్యలకు పాల్పడిందన్న అరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి, పంజాబ్ ముఖ్యమంత్రి మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీని ఈడీ అరెస్ట్‌ చేసింది.

సుమారు ఎనిమిది గంటల పాటు భూపీందర్‌ను విచారించిన ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టు చేశారు. గత నెలలో ఈడీ అధికారులు పంజాబ్‌లోని మొహాలీ, లూథియానా, రూప్‌నగర్, ఫతేఘర్ సాహిబ్, పఠాన్‌కోట్‌లో భూపీందర్‌ సింగ్‌తో పాటు పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇసుక మైనింగ్ వ్యాపారం, ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు, రూ. 21 లక్షల విలువైన బంగారం, రూ.12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌తో పాటు రూ.10 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఒకే ద‌శ‌లో ఫిబ్రవరి 20న జ‌ర‌గ‌నుండ‌గా.. మార్చి 10న ఫలితాలు వెలువడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles